కృష్ణ

నిధుల కొరతతో పడకేసిన పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక : మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలు నిధులు కొరత కారణంగా ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడుతోంది. మండలంలో మొత్తం 22 పంచాయతీలు ఉండగా రెండు పంచాయతీలు మినహా మిగిలిన 20 పంచాయతీలు మైనర్ పంచాయతీలుగా ఉన్నాయి. మేజర్ పంచాయతీలుగా నాగాయలంక, భావదేవరపల్లి కొనసాగుతున్నాయి. 10వేల జనాభా కలిగి ఉన్న నాగాయలంక పంచాయతీకి రూ.25 నుండి రూ.30లక్షల వరకు వార్షిక ఆదాయం వస్తుండగా, 5వేలు జనాభా కలిగిన భావదేవరపల్లికి రూ.2 నుంచి రూ.5లక్షలు మాత్రమే ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. ఇక మిగిలిన 20 పంచాయతీలలో రూ.50వేలు నుంచి రూ.లక్ష లోపు మాత్రమే వార్షిక ఆదాయాన్ని పొందుతున్నాయి. గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులతో ఆయా గ్రామాలలో కొంత మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన పరిస్థితులు ఉండగా ఈ సంవత్సరం మార్చి, జూన్ మాసాలలో ఈ పద్దు కింద ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాకపోవటం వల్ల పంచాయతీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. పంచాయతీలకు వచ్చే అరకొర ఆదాయం ఉద్యోగుల వేతనం, మంచినీరు, పారిశుద్ధ్యం వీధి లైట్లకు సైతం చాలని పరిస్థితి ఏర్పడటం శోచనీయం. గతంలో సర్పంచ్‌ల నేతృత్వంలో ఈ నిధులను వినియోగించే వారు. ఇప్పుడు సవరించిన నిబంధనల ప్రకారం ఆయా పంచాయతీల కార్యదర్శులే ఖాతాలను తెరవాలని, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ నిధులను వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న నిధులను సైతం వెచ్చించేందుకు వీలుకాని పరిస్థితుల్లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో గ్రామాలలో ఏ పని చేయాలన్నా సంబంధిత కార్యదర్శులే ముందుగా తమ జేబులోని సొమ్మును లెక్కించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. వీథులు వెంబడి బ్లీచింగ్ చల్లాలన్నా, ఇతర పనులకు ఇదే నిబంధనలు వర్తింప చేయాలనడంతో కార్యదర్శులు తలలు బాదుకొనవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక పంచాయతీ కార్యదర్శులు గత మూడు నెలలుగా వేతనాలు కూడా పొందలేని పరిస్థితులను బట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధమైన అవస్థలో ఉందో స్పష్టమవుతోంది. పూజ్య బాపూజీ కన్న గ్రామ స్వరాజ్యం ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొనడం ఆ శాఖ పనితీరుకు అద్దంపడుతోంది. పంచాయతీరాజ్ శాఖలో ఆయువుపట్టుగా ఉన్న గ్రామాలలో ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.