కృష్ణ

భూ హక్కుల కోసం ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి : భూమి కోసం, హక్కులు కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని కేరళ లెఫ్ట్‌ఫ్రంట్ గవర్నమెంట్ చైర్మన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎ విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 28వ రాష్ట్ర మహాసభలు 2వ రోజైన శనివారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్య వక్తగా పాల్గొన్న రాఘవన్ మాట్లాడుతూ పాలకవర్గ విధానాలు ధనికులకు అనుకూలంగా ఉన్నాయని, దీంతో పేదలకు లబ్ధి చేకూరటం లేదన్నారు. ప్రజల హక్కులను నిర్వీర్యం చేసే 12బిల్లులను పార్లమెంటులో ఆమోదింప చేశారని, ఇది బీజేపీ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉన్న పథకాలను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నించటం లేదని విమర్శించారు. స్వచ్ఛ భారత్ ప్రచారాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తొలుత సంఘం ఉపాధ్యక్షుడు పాటూరి రామయ్య సమావేశ ప్రాంగణంలో పతాకాన్ని ఆవిష్కరించగా అమర స్థూపం వద్ద రాఘవన్ నివాళులర్పించారు. కామ్రేడ్ గుంటూరు బాపనయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా రూపొందించిన బాపనయ్య బాటలో పుస్తకాన్ని పాటూరి రామయ్యతో కలిసి విజయ రాఘవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటూరి రామయ్య మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం అనుబంధ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. చల్లపల్లిలో కార్మిక సంఘం మహాసభలు జరగటం చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, ప్రతినిధులు నిర్మల, సింహాచలం, నాగరాజు, వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, బి వెంకట్, వెంకటేశ్వర్లు, వి శ్రీనివాసరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జె వెంకట్రాయులు, ఆర్ రఘు, వి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.