కృష్ణ

బోధనేతర సిబ్బందిపై సవతి తల్లి ప్రేమేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ధనాన్ని సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల్లా ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలకు కింది స్థాయి ఉద్యోగుల వెతలు ఏ మాత్రం అర్థం కావడం లేదు. విద్యను అందరికీ చేరువ చేయాలని, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించాలని, విశ్వ విద్యాలయాలను పరిశోధనా కేంద్రాలుగా మార్చాలనే ప్రభుత్వ ఆశయాలు అభాసుపాలవుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలం క్రితం ఏర్పాటు చేసిన విశ్వ విద్యాలయాల దుస్థితే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ఓ మంచి ఆశయంతో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటులో భాగంగా ఆరు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. 2008 జూలై 14వతేదీన విడుదల చేసిన జీవో నెం. 108 ద్వారా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. కృష్ణా వర్సిటీతో పాటు నెల్లూరులో విక్రం సింహపురి, శ్రీకాకుళంలో డా. అంబేద్కర్, కర్నూలులో రాయలసీమ, మహబూబ్‌నగర్‌లో పాలమూరు, కరీంనగర్‌లో శాతవాహన విశ్వ విద్యాలయాలను వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభమయ్యాయి. అయితే నూతనంగా ప్రారంభించిన విశ్వ విద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన 25 మంది ఆచార్య, సహ ఆచార్య, సహాయ ఆచార్య పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం బోధనేతర సిబ్బంది నియామకాన్ని మాత్రం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వటంతో ఆ లక్ష్యం నీరుగారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు ఏర్పాటై దశాబ్ద కాలం గడిచినా మళ్లీ అధ్యాపక పోస్టుల భర్తీకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. బోధనేతర సిబ్బంది విషయంలో సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఒక్కో విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 150కి పైగా పీజీ, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు కాలేజీలు ఉండగా 25వేల నుండి 30వేల మంది విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ, పునఃమూల్యాంకనం, సర్ట్ఫికేట్స్ ముద్రణ, కళాశాలలకు గుర్తింపు ఇవ్వటం లాంటి అనేక విధులను బోధనేతర సిబ్బంది మాత్రమే నిర్వహిస్తుంటారు. అంతటి కీలకమైన బోధనేతర సిబ్బంది పోస్టులను శాశ్వత ప్రాతిపదికన ఎందుకు భర్తీ చేయడం లేదనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఉపకులపతులు, రిజిస్ట్రార్లు సైతం బోధనేతర సిబ్బంది భవిష్యత్తు, సమస్యలపై దృష్టి సారించకపోవడాన్ని బట్టి విశ్వ విద్యాలయాలు కాలక్షేపక కేంద్రాలుగా మారిపోతున్నాయని చెప్పవచ్చు. అవుట్ సోర్సింగ్, దినసరివేతన సిబ్బంది భవిష్యత్తుకు భరోసా లేకపోవటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమతో రోజూ పని చేయించుకునే అధికారులే తమ గురించి ఏ మాత్రం ఆలోచించకపోతే తమ గోడు ఇంకెవ్వరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మన జిల్లాలోని కృష్ణా విశ్వవిద్యాలయానికి వస్తే కేవలం రెండు రెగ్యులర్ బోధనేతర సిబ్బంది పోస్టులతో కొనసాగుతోంది. ఈ విషయంలో ప్రస్తుత ఔట్ సోర్సింగ్, దినసరివేతన బోధనేతర సిబ్బంది వైఫల్యం కూడా కొంత కారణంగా చెప్పువచ్చు. సమస్యను గతంలో అనేక సార్లు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. విశ్వవిద్యాలయంలో ఆధిపత్య పోరు కూడా వీరి పాలిట శాపంగా చెప్పవచ్చు. విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పటి నుండి పని చేస్తున్న ముగ్గురు ఆచార్యులు తమ ఆధిపత్యం కోసం బోధనేతర సిబ్బంది సమస్యలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. సింహపురి విశ్వవిద్యాలయం తీరు ఇందుకు భిన్నంగా చెప్పవచ్చు. ఆ విశ్వ విద్యాలయం అధికారుల చొరవే గానీ, ప్రజా ప్రతినిధుల కృషే గానీ గడిచిన దశాబ్ద కాలంలో ఆ విశ్వ విద్యాలయానికి 61 శాశ్వత ప్రాతిపదికన బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేయించుకుంది. 2011 సెప్టెంబర్ 23వతేదీన జీవో నెం.215 ద్వారా ఎనిమిది పోస్టులు మంజూరవ్వగా ఏడు రోజుల వ్యవధిలో 30వతేదీన జీవో నెం.263 ద్వారా మరో ఎనిమిది పోస్టులు మంజూరయ్యాయి. 2013 అక్టోబర్‌లో 45 పోస్టులు మంజూరు కావడం విశేషం.