కృష్ణ

నాగాయలంకకు మళ్లీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో దివిసీమకు పడమర, తూర్పు పాయలకు మరలా వరద ప్రవాహం మొదలైంది. ఈ ప్రాంతానికి తూర్పు పాయ నుంచి హంసలదీవి మీదుగా సముద్రానికి వరద నీరు చేరుతుండగా పడమటి పాయ నాగాయలంక నుంచి దక్షిణ దిశగా ఉన్న సముద్రానికి ఈ నీరు చేరుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో నదికి మరలా వరద నీరు చేరటం రెండవ సారి. తొలుత వచ్చిన వరద సమయంలో తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆ సమయంలో స్థానిక శ్రీ రామపాదక్షేత్రం సమీపాన ఏటికట్ట పొడవున నివశిస్తున్న పేద వర్గాల వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సహాయ పునరావాస కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణా ఆనకట్ట వద్ద ఎగువ నుండి వచ్చే వరద నీటిని విడుదల చేయటంతో మరలా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు తీర ప్రాంత గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేవు. ఏది ఏమైనా మరో రెండు రోజులు పాటు ఈ ప్రవాహం ఇదే విధంగా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రతి విద్యార్థీ ఉన్నత స్థితికి చేరాలన్నదే
ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే డీఎన్నార్
కలిదిండి, సెప్టెంబర్ 14: ప్రతి విద్యార్థి ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశ పెట్టారని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండల పరిధిలోని పెదలంకలో రూ.52లక్షల 91వేలతో ఉన్నత పాఠశాల వౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకునే విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తామని, ఉన్నత చదువులు కోసం పూర్తిగా ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందని, విద్యార్థుల అదనపు వసతికి రూ.20వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ ప్రేమ్‌చంద్, నాయకులు, అయినాల బ్రహ్మాజి, మోకా రామకృష్ణ, ఎస్‌ఐ రాజు, కోకా సూర్యనారాయణ, దుగ్గిరాల నాగు, ఎం కోటేశ్వరరావు, భోగేశ్వరరావు, ఉపాధ్యాయుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పడమటపాలెం గ్రామంలో ఆది వినాయక స్వామి 23వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.