కృష్ణ

గూడు.. గోడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : పేదవాడి గృహ నిర్మాణ బిల్లులు గుదిబండగా మారాయి. రోజులతో పాటు నెలలు గడుస్తున్నా విడుదల కాని బిల్లులతో పేద వాడి సొంతింటి కల కలగానే మారిపోతోంది. ఫలితంగా గృహ నిర్మాణ పథకం అటకెక్కింది. జిల్లాలో పేరుకుపోయిన గృహ నిర్మాణ బిల్లుల వ్యయం పరిశీలిస్తే నివ్వెరపోక తప్పదు. అక్షరాలా 76 కోట్ల రూపాయలు గృహ నిర్మాణ బిల్లులు మంజూరుకు నోచుకోవడం లేదు. బిల్లుల కోసం లబ్ధిదారులు గృహ నిర్మాణ శాఖాధికారుల చుట్టూ తిరగని రోజంటూ లేదు. గడిచిన ఐదు నెలలుగా ఒక్కరూపాయి కూడా గృహ నిర్మాణ బిల్లులు మంజూరు కాలేదంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గడిచిన ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు యూనిట్‌గా గృహ నిర్మాణాలు మంజూరు చేసింది. 2016-17లో 72వేల 457 మందికి, 2018-19లో 17వేల 58 మందికి గృహ నిర్మాణాలు మంజూరయ్యాయి. ఆది నుండి తుది వరకు మంజూరు కాని బిల్లులతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు పడుతూనే వచ్చారు. బిల్లులు మంజూరు కాకపోవటంతో గృహ నిర్మాణ వ్యయం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నాటికీ నేటికీ నిర్మాణ వ్యయం పెరిగిపోవటంతో సొంతింటి ఊసునే లబ్ధిదారుడు మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది లబ్ధిదారులు వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను అక్కడితోనే వదిలి పెట్టేస్తున్నారు. ఏప్రిల్ నుండి నేటి వరకు జిల్లాలో 24,002 మంది లబ్ధిదారులకు రూ.76.03కోట్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఈ గృహాలను మంజూరు చేసింది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని కాస్త వైఎస్‌ఆర్ గృహ నిర్మాణ పథకంగా మార్చింది. కానీ బిల్లుల సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.