కృష్ణ

యా హుస్సేన్.. యా హుస్సేన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : యా హుస్సేన్.. యా హుస్సేన్.. అంటూ ముస్లింలు గుండెలు అవిసేలా శోకించారు. వీరి రోదనలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఇస్లాం మత పరిరక్షణకై కర్బలా మైదానంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ మంగళవారం కోనేరుసెంటరులో నిర్వహించిన మాతాం (చెస్ట్ బీటింగ్)లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. చిన్న పార్టీ, పెద్ద పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. పది మొహర్రం దుఖఃదినాల అనంతరం 11వ రోజైన మంగళవారం నగర నడిబొడ్డు కోనేరుసెంటరు వేదికగా షియా వర్గానికి చెందిన ముస్లింలు రక్తంతో అమరవీరులకు నివాళులర్పించారు. 10వ రోజైన సోమవారం రాత్రి ఇనగుదురుపేట ఇమాం పంజాలోని అలాంకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రభుత్వం తరఫున ధట్టి సమర్పించారు. 11వ రోజైన మంగళవారం తొలుత చిన్న పార్టీ అయిన గిరోహ్ - ఎ - హుజ్జత్ ఆధ్వర్యంలో ఇనగుదురులోని సాహెబ్ పంజా నుండి ఊరేగింపుగా బయలుదేరి చింతచెట్టు సెంటరు, నాగపోతరావు సెంటరు మీదుగా కోనేరుసెంటరుకు చేరుకుని చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. మీర్ జాఫర్ అలీ, జాఫర్ అలీ చిన్న పార్టీకి నాయకత్వం వహించారు. అనంతరం పోర్టు రోడ్డు గుండా జవ్వారుపేట, కొత్త మసీదు మీదుగా చెంపా చెరువుకు చేరుకుని పీర్లను గుండాన పడవేశారు. అనంతరం పెద్ద పార్టీ అయిన గిరోహ్ - ఎ - మీరేన్‌షా ఆధ్వర్యంలో వౌలానా పంజా నుండి బయలుదేరి బుట్టాయిపేట, రాజాగారి సెంటరు మీదుగా కోనేరుసెంటరు చేరుకుని చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. తరువాత నాగపోతరావు సెంటరు, చింతచెట్టు సెంటరు మీదుగా దేశాయిపేటలోని చంపా చెరువుకు చేరుకుని పీర్లను గుండాన వేశారు. పెద్ద పార్టీకి ఇనాయత్ అలీ నాయకత్వం వహించారు. చెస్ట్ బీటింగ్‌కు ముందు కోనేరుసెంటరులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బేదార్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చెస్ట్ బీటింగ్‌ను పురస్కరించుకుని నగర పాలక సంస్థ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రక్తం చిందించిన వారికి ఉపశమనం కలిగించేందుకు గాను ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి వైద్య సహాయం అందజేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ దగ్గరుండి పారిశుద్ద్య చర్యలను పర్యవేక్షించారు. పలు కూడళ్లలో మజ్జిగ పంపిణీ, అన్న సమారాధన నిర్వహించారు. అధికార వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, షేక్ అచ్చాబాతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు చెస్ట్ బీటింగ్‌లో పాల్గొన్న వారికి సపర్యలు చేశారు.