కృష్ణ

ఆధార్, ఈకేవైసీ నమోదుపై ఆందోళనొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ : ఆధార్, ఈకేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం స్థానిక రాజేంద్రనగర్లోని ఆయన ఇంట్లో ఎల్‌ఐసీ ఉద్యోగులు నానిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో ఈకేవైసీ చేసుకోకపోతే కార్డులను తొలగిస్తారని ప్రజల్లో అపోహలు సృష్టించారని, అటువంటిదేమీ లేదన్నారు. గతంలో చేసుకోని వారు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే చిన్నపిల్లల ఆధార్ బయోమెట్రిక్ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్‌లు, మీసేవా కేంద్రాలు, పోస్ట్ఫాసుల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపి అన్ని వివరాలను నమోదు చేయస్తుందన్నారు. ఈకేవైసీకి సెప్టెంబర్ 5వ తేదీ ఆఖరు తేదీ అని, అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగిస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

ముగిసిన గంగానమ్మ తల్లి సంబరాలు
కూచిపూడి, ఆగస్టు 25: మండల కేంద్రం మొవ్వలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారంతో ముగిశాయి. గత మూడు రోజులుగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీ ర్చుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భ క్తులకు తీర్ధ ప్రసాదాల వినియోగం జరిగింది.