కృష్ణ

జైట్లీ మృతి దేశానికి తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణం భారతీయ జనతా పార్టీతో పాటు దేశానికి తీరని లోటని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో అరుణ్ జైట్లీ సంతాప సభ నిర్వహించారు. తొలుత అరుణ్ జైట్లీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ బీజేపీ బలోపేతంలో జైట్లీ పాత్ర కీలకమైనదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ జైట్లీ కీలక పాత్ర పోషించారన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కూనపరెడ్డి శ్రీనివాస్, పంతం వెంకట గజేంద్రరావు, నూకల వెంకట శేషయ్య నాయుడు, తోట రంగనాథ్, సిహెచ్ పద్మరాజు, రాము, అమృద్దిన్, కూనపరెడ్డి సుబ్బారాయుడు, రామకృష్ణ, సైకం భాస్కరరావు, బొడ్డు సునీల్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, చంద్రశేఖర్, వి సుబ్బారావు, ప్రతాప్, ఘంటా సతీష్ తదితరులు పాల్గొన్నారు.