కృష్ణ

వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : మండల పరిధిలోని పులిగడ్డ శివారు గ్రామాలైన రేగుల్లంక, పల్లెపాలెం, వసుమెట్ల వారిపాలెంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. విష జ్వరాల తీవ్రతను గుర్తించి వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న బీసీ వెల్ఫేర్
డైరెక్టర్ రామారావు
మోపిదేవి, ఆగస్టు 25: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆదివారం రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ బి రామారావు దర్శించుక్నురు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ లీలాకుమార్ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బద్దు పవన్ కుమార్ శర్మ నాగ పుట్ట పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రామారావుకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను ఎసీ లీలాకుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డీడీ భార్గవి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ భానుప్రసాద్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.