కృష్ణ

భీమనది ఛానల్‌కు గండి కొట్టిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి : మొవ్వ మండలం వేములమడ పరిసర గ్రామాలలో నెల రోజులుగా సాగునీరు అందక వ్యవసాయ భూములు ఎండిపోతుండడంతో పామర్రు నియోజకవర్గ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు శనివారం భీమనది ఛానల్‌కు గండి కొట్టారు. భీమనది డ్రైన్ పరిధిలోని మొవ్వ, మొవ్వపాలెం, కొండవరం, వేములమడ, కెటిపాలెంతో పాటు ఘంటసాల మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే భీమనది డ్రైన్ ఎగువ నుండి డ్రైన్‌లోకి నీరు వదలకపోవటంతో దిగువ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. సాగునీరు సరఫరా చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా శాసనసభ్యుడు చెప్పినా కూడా సాగునీటి సరఫరాలో మీనమేషాలు లెక్కిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారుల వైఖరిపై ఆగ్రహించిన రైతులు శనివారం కొండవరం గ్రామ శివారు ప్రాంతంలో భీమనది ఛానల్‌కు గండికొట్టి సాగునీటిని మళ్లించారు. రెండు రోజులకు ఈ నీరు భీమనది డ్రైన్‌లోకి చేరి పది గ్రామాలకు పైగా సాగునీరుగా ఉపయోగపడుతుందని సీపీఎం కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూరపాటి కృష్ణమూర్తి, వి వెంకటేశ్వరరావు, శీలం ప్రకాశరావు, కోటయ్య, వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన పంటల నష్టం నమోదు
తోట్లవల్లూరు, ఆగస్టు 24: కృష్ణానది వరదలకు వాణిజ్య పంటలు దెబ్బతినటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం వ్యవసాయాధికారులు పంట నష్టం నమోదును ప్రారంభించారు. మండలంలోని పలు లంక గ్రామాల్లో వ్యవసాయాధికారులు, మండల స్థాయి, గ్రామస్థాయి బృందాలు పంట పొలాల్లోకి వెళ్ళి పంటల పరిస్థితిని పరిశీలించి రైతుల దగ్గర నుంచి సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకుని పంట నష్టాన్ని నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని నమోదు చేస్తున్నామని ఏఓ శ్రీనివాసరావు తెలిపారు. కనుక రైతులు సహకరించాలన్నారు. పంట పొలాల్లో పర్యటిస్తున్న గ్రామ స్థాయి బృందాల వద్ద రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకాలను, జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు.