కృష్ణ

పేటలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : పట్టణంలోని పలు ఆలయాలు, పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రంగనాయకస్వామి, పాత వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, విజయవాడ రోడ్డులోని సంతాన వేణుగోపాలస్వామి తదితర ఆలయాల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామికి తులసితో ప్రత్యేక అలంకారం గావించి సాయంత్రం ఉట్టి ఉత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని చేగు విద్యాలయంలో కృష్ణాష్టమి పురస్కరించుకుని శ్రీ కృష్ణపూజ, ఉట్టి కొట్టడం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు, రాధ వేషధారణలో చిన్నారులు అలరించారు. చైతన్య టెక్నో స్కూల్‌లో కృష్ణాష్టమిని పురస్కరించుకుని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.