కృష్ణ

నినదించిన విద్యార్థి లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి లోకం నినదించింది. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో గురువారం నగర వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లే కార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వీరి చర్యలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనకు నాయకత్వం వహించిన పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టులకు ముందు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించిన విద్యార్థులనుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రసంగాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న సాచివేత ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగా విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకువస్తానన్న నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మార్పులు చేయకపోగా కొత్త సమస్యలు తీసుకు వస్తున్నారని విరుచుకుపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చదువు పూర్తి చేసిన విద్యార్థులు సర్ట్ఫికేట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ప్రతి నెలా ఇవ్వాల్సిన కాస్మోటెక్, మెస్ ఛార్జీలను కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆరు నెలలుగా కాస్మోటెక్, మెస్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్న కారణంగా సంక్షేమ వసతి గృహాల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్‌లు, లైట్లు కల్పించడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఫోటోలు తీసే కార్యక్రమంతో ప్రభుత్వం సరిపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలల్లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం గర్హనీయమన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలా అనేక సమస్యలతో విద్యా రంగం భ్రష్ఠు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె పవన్ కుమార్, పి పవన్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జి సన్ని, హర్ష, పవన్, హోరా, నిరంజన్, కల్యాణ్, రేవంత్, కె రాంబాబు, ఎస్ సమరం, బి ఫణి కుమార్, నాగబాబు, కీర్తి, సాయి గణేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.