కృష్ణ

జిల్లాకు జాతీయ పోషణ్ అభియాన్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక జాతీయ పోషణ్ అభియాన్ పురస్కారాన్ని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఈనెల 23న శుక్రవారం ప్రధానమంత్రి చేతుల మీదుగా అందుకోనున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ పోషకాహార కార్యక్రమం జిల్లాలో ఉత్తమంగా అమలయినందుకు ఈ పురస్కారం లభించింది. జిల్లాలో కన్వర్‌జెన్సీ యాక్షన్ సమావేశాలను 26చోట్ల నిర్వహించడం, పోషణ్ అభియాన్‌పై నూరుశాతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కమ్యూనిటీ బేస్‌డ్ ఈవెంట్స్ 100శాతం నిర్వహించడం, నూరుశాతం ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్వహణను పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయి అవార్డును ప్రకటించారు. జిల్లాలో ఆర్నెల్ల కాలంలో రక్తహీనతను ఆరుశాతం నుంచి 0.5శాతానికి తగ్గించడం పోషకాహార లోపాన్ని నివారించడంతోపాటు జిల్లాలో 5.04 శాతం మంది పిల్లలు మాత్రమే తక్కువ బరువుతో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును ప్రకటించింది. అంతేకాకుండా జిల్లాలో అన్ని అంగన్‌వాడీల్లో నూరుశాతం గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం, జిల్లాలో రసాయన పురుగుల మందులను వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించేలా 249 న్యూట్రీ గార్డెన్లు అభివృద్ధి చేసినందుకుగాను ఈ అవార్డు ప్రకటించబడింది.