కృష్ణ

శాంతించిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : గత నాలుగైదు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. ఎగువ రాష్ట్రాల నుండి ఉప్పొంగుతూ వచ్చిన కృష్ణమ్మ పరవళ్లు తగ్గటంతో వరద ఉధృతి కూడా కొంత మేర తగ్గుముఖం పట్టింది. కృష్ణానది కరకట్టల అంచులను తాకుతూ ప్రవహించిన కృష్ణాజలాలు ఆదివారం నాడు మూడు అడుగుల మేర తగ్గాయి. అయితే ఇప్పటికే ముంపు బారిన పడిన లంక గ్రామాలు, నదీ పరివాహక గ్రామాలు ఇంకా ముంపులోనే కొనసాగుతున్నాయి. గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చిన వరద నీటిని కాలువల గుండా మళ్లించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం ఉన్న 41 పునరావాస కేంద్రాల్లో 8వేల 100 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. ఆదివారం నాటికి పునరావాస కేంద్రాల సంఖ్య 46కు చేరుకుంది. మొత్తం 12వేల 653 మంది పునరావాసం పొందుతున్నారు. 26వేల 19 ఆహార పొట్లాలు, 57వేల 29 వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. 8వేల 642 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోయినట్టు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. అలాగే 4వేల 380 గృహాలు వరద ముంపుకు గురైనట్లు గుర్తించారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలు తయారీకి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక బృందాల ద్వారా పంట, ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం చేపడుతోంది. ఇదిలా ఉండగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపర్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు నడుం బిగించారు. అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు కూడా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధమైంది. నేటి నుండి పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు, పారిశుద్ధ్య చర్యలను అధికారులు మెరుగుపర్చనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఆయన దివిసీమలోని పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేశారు.