కృష్ణ

దేశాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్య సాధనలో బ్యాంక్‌ల పాత్ర కీలకమైనదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ రీజనల్ మేనేజర్ ఎం దిలీప్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌బీఐ ప్రాం తీయ కార్యాలయంలో రెండు రోజుల పాటు బ్యాంక్ మేనేజర్లతో ఐదు ట్రిలియన్ ఆర్థిక వృద్ధి సాధనపై నిర్వహించను న్న బ్యాంకర్ల ప్రాంతీయ సమాలోచన సమావేశాన్ని ఆదివా రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ మే నేజర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలకమైనదన్నారు. ఈ రంగం అభివృద్ధికి నూతన ఆలోచనలను జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగ అభివృద్థికి సంబంధించి సలహాలు, సూచనలు కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు గాను క్షేత్ర స్థాయిలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు రుణాన్ని పెంచడానికి గల మార్గాల అనే్వషణ, ఆవిష్కరణలకు సాంకేతికతను అంశంగా వినియోగించడం సమావేశం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సీనియర్ సిటిజన్లు, రైతులు, చిన్న పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, యువకులు, విద్యార్థులు, మహిళల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా మరింతగా ప్రతిస్పందించేలా బ్యాంకింగ్‌ను తీర్చిదిద్దడం ద్వారా ఐదు ట్రిబిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యం సాధించవల్సి ఉందన్నారు. డెప్యూటీ జనరల్ మేనేజర్ అంబటి వెంకట్రామయ్య మాట్లాడుతూ ఖాతాదారులకు సేవలు అందించడంలో ఎస్‌బీఐ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 48 బ్రాంచ్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.