కృష్ణ

అధైర్యపడకండి.. ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : వరద ముంపు బాధితులు ఏ మాత్రం అధైర్యం పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు అనీల్ కుమార్ యాదవ్, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) హామీ ఇచ్చారు. వరద ముంపు మండలాలైన తోట్లవల్లూరు, పమిడిముక్కల, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో శనివారం వారు విస్తృతంగా పర్యటించారు. ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించి అధికారులు చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో ఇంకా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లని ప్రజలను కలిసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఆయా మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కూడా మంత్రులు సందర్శించి వరద బాధితులకు అందుతున్న పునరావాస సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడిక్కడే ముంపు పరిస్థితులను అంచనా వేసి అధికారులకు పలు సూచనలు చేశారు. నీట మునిగిన గృహాలతో పాటు పంట పొలాలను కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎగువ నుండి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రణాళికా బద్ధంగా దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వరద తగ్గు ముఖం పట్టే వరకు వరద ముంపు ప్రాంత ప్రజలంతా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నామన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. వృద్ధులు, చిన్నారులకు పాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరం మేరకు ఫుడ్ ప్యాకెట్‌లు, వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరద తగ్గు ముఖం పట్టిన తర్వాత నష్టం అంచనాలు తయారు చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరద నీటికి నష్టపోయిన ప్రతి ఎకరాన్ని పరిగణలోకి తీసుకుని రైతులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరి పర్యటనలో పామర్రు, అవనిగడ్డ ఎమ్మెల్యేలు కైలే అనీల్ కుమార్, సింహాద్రి రమేష్, బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్ తదితరులు ఉన్నారు.

వరద ప్రభావిత గ్రామాల్లో
టీడీపీ నేతల పర్యటన
* బాధితులకు మాజీ మంత్రి ఉమ, సౌమ్య పరామర్శ
చందర్లపాడు, అగస్టు 17: మండలంలోని వరద ప్రభావిత గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా నీటి ముంపుకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి తమ పా ర్టీ అండగా ఉంటుందని అన్నారు. ఏ టూరు గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమ వరద ముంపుకు గురైన లం క ప్రాంతాన్ని పరిశీలించారు. లంక భూములలో వేసిన పంట నీటిలో ము నిగి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఒ క్కరూ అప్రమత్తంగా ఉండాలని వరద సమయంలో లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.