కృష్ణ

ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్ : స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం పులిచింతల ప్రాజెక్టుతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతమైన ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గ ప్రజలను వరద ముంపుకు గురికాకుండా అప్రమత్తం చేస్తుమని, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులు ఏవిధంగా జలకళను సంతరించుకున్నాయో ప్రస్తుతం ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో ప్రాజెక్టులు అన్ని జలకళతో కళకళలాడుతున్నాయని తెలిపారు. కృష్ణా, డెల్టా ప్రాంతం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా 2014లో వైఎస్ రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేశారని, మొదటిసారిగా పులిచింతల ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీరు చేరుకోవడం హర్షణీయమన్నారు. 175 అడుగులకు గాను 152 అడుగుల మేర వుద నీరు వచ్చిచేరిందని, పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 6లక్షలు ఉండగా అవుట్ ఫ్లో నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గ ప్రజలను వరద ముంపుకు గురికాకుండా అప్రమత్తం చేశామని, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో మంచినీరు, శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రావిరాల వేదాద్రిలో కృష్ణానదికి పసుపు, కుంకుమ సమర్పించి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఇ రమేష్‌బాబు, వైకాపా నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, చిలుకూరి శ్రీనివాసరావు, మారేళ్ళ సూరారెడ్డి, వేల్పుల రవి, ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.