కృష్ణ

రేషన్ డీలర్లకు ఎసరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ఒకరికి మేలు చేసేందుకు మరొకరికి నష్టం చేయాలా..? గ్రామ వలంటీర్ల వ్యవస్థ కోసం గత నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న తమను రోడ్డున పడేస్తారా..? ఇదేనా రాజన్న రాజ్యమంటే అని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్లను తెర మీదకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి ఇకపై వారి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రభుత్వం సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో దారిద్య్ర రేఖకు దిగవున ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు ఇచ్చేందుకు గాను 1977వ సంవత్సరంలో ప్రారంభించిన చౌక ధరల దుకాణాలను మూసి వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్రామ వలంటీర్లే వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రతి నెలా 1వతేదీన రేషన్ సరుకులు ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దు మీద మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నోరు విప్పలేదు. రద్దు చేస్తామని పరోక్షంగా తమకు సంకేతాలు అందిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ఉన్నట్టుండి తమను తీసి వేస్తే బతికేదెలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ చెప్పినట్టు రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2వేల 160 చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలు ప్రతి నెలా 1వతేదీ నుండి 15వతేదీ వరకు ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర వస్తువులు పొందుతున్నారు. 12.63లక్షల మంది రేషన్ కార్డుదారులకు డీలర్లు తమ సేవలు అందిస్తున్నారు. కమిషన్ పద్ధతిలో వీరంతా చౌక ధరల దుకాణాలను నిర్వహిస్తున్నారు. గతంలో వీరి ఆదాయం ఆరు పూలు మూడు కాయలు అన్న చందాన ఉండేది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో ఈ-పోస్ విధానాన్ని తెర మీదకు తీసుకు వచ్చింది. రేషన్ కార్డుదారుని వేలిముద్ర లేకుంటే కంటి పాప ఆధారంగానే రేషన్ ఇస్తుండటంతో వచ్చే కొద్దిపాటి ఆదాయానికి గండి పడింది. చాలీ చాలనీ కమిషన్‌తోనే రేషన్ దుకాణాలను నడిపిస్తున్నారు. కమిషన్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలంటూ గత కొంత కాలంగా వీరంతా పోరాటం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు ఒక్కసారిగా పెంచటంతో తమను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించారు. అంచనాలు తారుమారై వ్యవస్థకే ఎసరు పెట్టే పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటికే పలు రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన రేషన్ డీలర్లు రానున్న రోజుల్లో కూడా పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు.