కృష్ణ

రాజధాని పేరిట అంతర్జాతీయ స్కామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ) : అంతర్జాతీయ రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి పాల్పడిందని పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఆరోపించారు. రాజధాని భూముల విషయంలోనూ తెలుగుదేశం నాయకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తుగ్లక్ పాలన, నిర్వాకం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వకుండా నేడు దూరమైందన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలుచేసే నిర్ణయాలు తీసుకుంటుంటే అదిచూసి అసూయతో తుగ్లక్ పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఖండించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బాబు, లోకేష్ పాల్పడిన అంతర్జాతీయ కుంభకోణాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొదట రాజధానికి అనువైన ప్రాంతం నూజివీడు అంటూ ప్రచారం చేసి ఎంతోమందితో అక్కడ స్థలాలు కొనుగోలు చేయించారన్నారు. తరువాత వారిని బలిచేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయించటంలో ఉద్దేశ్యాన్ని బయటపెట్టాలన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలను రైతులు ఇచ్చారని చెబుతున్న బాబుతో బలహీన వర్గాల రైతులు కలిసివచ్చారా? అని ప్రశ్నించారు. అధికారులను, మంత్రులను పంపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి 33వేల ఎకరాలు సేకరించారన్నారు. కానీ ఏమేరకు వారికి మేలుచేకూర్చారో చెప్పాలన్నారు. అమరావతిని భ్రమరావతిగా చూపించారన్నారు. ఐదేళ్లు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ వచ్చారన్నారు. సామాజిక న్యాయం పాటించలేదని, మూడునాలుగు పంటలు పండే మంచి వ్యవసాయ భూమిని ప్రభుత్వం తీసుకుందని, ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నందునే తాము రుణం ఇవ్వటం లేదని ప్రపంచ బ్యాంకు లేఖలో పేర్కొందని తెలిపారు. ఆ లేఖ వెబ్‌సైట్‌లో పెట్టేనాటికి వైసీపీ అధికారంలోకి వచ్చి కేవలం 12రోజులు మాత్రమే అయ్యిందని, గత ప్రభుత్వ నిర్వాకం ఫలితంగానే ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లిందన్నారు. మాకీ అసోసియేట్స్ సంస్థతో రాజధాని నిర్మాణానికి ఒప్పందం చేసుకుని డబ్బుల పంపకాల్లో జరిగిన తేడాలతోనే తరువాత రద్దు చేసుకున్నారన్నారు. ఆ సంస్థ దీనిపై బహిరంగ లేఖ కూడా రాసిందన్నారు. లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన విధానం చూస్తే మన రాష్ట్ర పరువు ప్రతిష్ఠలను బాబు ప్రభుత్వం ఏవిధంగా దిగజార్చిందో అర్థవౌతుందన్నారు. గత ఐదేళ్ల తుగ్లక్ పాలన కారణంగానే ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిన విషయాన్ని బాబు, లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. ఐదేళ్లలో రాజధాని భూముల్లో చేసిన ఇన్‌సైడ్ ట్రేడింగ్, దోపిడీ చేసిన విధానాన్ని ప్రజలు గ్రహించారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్చుతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. బాబు, లోకేష్ ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పెట్టుబడుల పేరుతో వేల కోట్ల భూములను కట్టబెట్టిన విషయాలనూ బయటు తీస్తామన్నారు. మంచి విజన్ ఉన్న నేతగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని రమేష్ వివరించారు.