కృష్ణ

ఆశలు రేపుతున్న వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : గత రెండు మూడు రోజులుగా అడపా దడపా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌పై రైతులు పెట్టుకున్న ఆశలను మరింత చిగురింప చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలు రైతుకుటుంబాలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నీళ్ల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ఒక పక్క పట్టిసీమ ద్వారా ఇటీవల విడుదలైన నీరు కొంత మేర ఆదుకోగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత మేలు చేస్తున్నాయి. పట్టిసీమ నీళ్లకు వర్షపు నీరు తోడవటంతో రైతులు మరింత ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ముందుకు తీసుకువెళుతున్నారు. మరీ ముఖ్యంగా వెద పద్ధతిన సాగు చేసిన పొలాలకు వర్షాలు మరింత ఊతమిస్తున్నాయి. సకాలంలో తొలకరి వర్షాలు పడకపోవటం, గోదావరికి ఆశించిన మేర వరద లేకపోవటంతో పట్టిసీమ నీళ్లు రావడంలో జాప్యం ఏర్పడటంతో దాదాపు డెల్టాలో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. మొక్కవోని ధైర్యంతో రైతులు ముందుగానే బోర్ల కింద నారుమడులు పోశారు. కొన్ని ప్రాంతాల్లో వెద పద్ధతిన సాగు చేశారు. విపత్కర పరిస్థితులు తొలగిపోవటంతో డెల్టాలో ఎటు చూసినా పచ్చని నారుమడులే కనిపిస్తున్నాయి. పనులు లేక దీనావస్థలో ఉన్న వ్యవసాయ కూలీలు నేడు రెండు చేతులా వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం అయ్యే సరికి కూలీ సొమ్ము చేత పట్టుకుని ఆనందంతో ఇంటికి వెళుతున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 12.5మి.మిల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడూరు మండలంలో 105.0మి.మిలు కురవగా అత్యల్పంగా గుడివాడ, పామర్రులలో 1.2మి.మిలు చొప్పున వర్షపాతం నమోదైంది. 49 మండలాలకు గాను 27 మండలాల్లో 1.2 మి.మిల నుండి 105.0మి.మిలు వరకు వర్షపాతం నమోదు కావడం విశేషం. తిరువూరు మండలంలో 95.2మి.మిలు, నాగాయలంకలో 70.0, అవనిగడ్డలో 61.4, కృత్తివెన్నులో 46.0, మచిలీపట్నంలో 42.4, పెడనలో 34.0, గుడ్లవల్లేరులో 27.8, కైకలూరులో 24.8, గూడూరులో 22.8, బంటుమిల్లిలో 21.2, కలిదిండిలో 19.8, చల్లపల్లిలో 15.0, మోపిదేవిలో 12.0, మండవల్లిలో 8.4, మొవ్వలో 7.6, ఉయ్యూరులో 6.8, ఘంటసాలలో 4.8, బాపులపాడులో 4.6, ఎ.కొండూరులో 3.0, మైలవరంలో 2.4, ముదినేపల్లిలో 2.2, కంకిపాడులో 2.2, పెదపారుపూడిలో 2.2, పమిడిముక్కలలో 1.6, గుడివాడలో 1.2, పామర్రులో 1.2మి.మిలు చొప్పున వర్షపాతం నమోదైంది.