కృష్ణ

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ/మచిలీపట్నం (కోనేరుసెంటరు) : జిల్లా కేంద్రం మచిలీపట్నంలో భారీ వర్షంతో జలమయమైంది. శనివారం తెల్లవారు జామున సుమారు రెండు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదార్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్దిపాటి వర్షానికే నీట మునిగే బందరు బస్టాండ్ యధాతధా అన్నట్టు నీట మునిగింది. ఇటీవల బస్టాండ్ ఆవరణలో కొంత మేర మెరక చేసినా నీట మునగక తప్పలేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే బస్టాండ్ సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు ప్రధాన రహదారిలో అడుగు మేర వర్షపునీరు నిలిచింది. టెంపుల్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీ, ఎస్టీ కాలనీ, కాలేఖాన్‌పేట తదితర లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రావటానికి అవస్థలు పడ్డారు.
అవనిగడ్డలో ....
అవనిగడ్డ, : అవనిగడ్డలో శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలలో వర్షం నీరు ప్రవేశించటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దాదాపు తెల్లవారు జాము నుండి ఉదయం 10గంటలు వరకు కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. గాంధీ క్షేత్రంలోని తపాలా కార్యాలయం, గృహాలలో, ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అశ్వరావుపాలెం, మోదుమూడి తదితర గ్రామాలలోని వడ్ల పురిలలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటువ్యాధులు వ్యాపించకుండా పలు గ్రామాలలో వ్యాధి నిరోధక మందును వెదజల్లుతున్నారు. దాదాపు 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.