కృష్ణ

ప్రతి హామీ అమలు దిశగా సీఎం జగన్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుచేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలనలో అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కేటాయింపు, నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు, పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్ నవోదయ పథకం తదితర అంశాలను వివరిస్తూ బీసీ ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నామినేటెడ్ పోస్టులతో సహా నామినేషన్ పనుల్లో కూడా 50 శాతం కేటాయించారని అన్నారు. మహిళలకు అత్యున్నత స్థానం కల్పించేలా 50 శాతం స్థానాలు ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారని, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందించాలన్న నిర్ణయం, వైఎస్‌ఆర్ నవోదయంకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. న్యాయ పరిశీలన, పారదర్శకత చట్టం 2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అంతులేని అవినీతి జరిగిందని, గత ప్రభుత్వం వేలాది కోట్లు దోచుకుందని ఆరోపించారు.
గత ప్రభుత్వం చేసిన అవినీతిని బట్టబయలు చేస్తామనీ, ప్రజలకు అన్ని అంశాలు వివరించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు తన్నీరు నాగేశ్వరరావు, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, ఎంవి చలం, వూట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.