కృష్ణ

ట్రిపుల్ ఐటీల్లో తెలుగులో బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ ప్రాంతాలలో నడుస్తున్న ట్రిపుల్ ఐటీలలో చదువుకుంటున్న విద్యార్ధులకు అనువుగా ఉండేందుకు తెలుగు మాధ్యమంలో పాఠ్యాంశాల బోధన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వవిద్యాలయం కులపతి కెసీ రెడ్డి వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో 85 శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని, వీరు ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరికి వీలుగా ఉండే విధంగా తెలుగు మాధ్యమంలో కూడా బోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆర్జేయూకేటీ కులపతిగా కేసీ రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్ ఐటీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయటంవల్ల పదో తరగతిలో తెలుగు మాధ్యమం నుండి వచ్చిన ఎక్కువ శాతం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పలువురు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలుగు మాధ్యమంలో కూడా బోధించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్జేయూకేటీ పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో నడుస్తున్న ట్రిపుల్ ఐటీలన్నింటికీ ఒకే విధంగా బోధన పద్ధతులు ఉండే విధంగా క్యాలండర్ రూపొందిస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ ఐటీలలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీలు వేస్తున్నామని, కమిటీ సిఫార్సుల మేరకు సంస్కరణలు చేపడతామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మానసపుత్రిక ట్రిపుల్ ఐటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రవేశం కల్పించి వారికి అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యనందించాలన్నదే ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్దులకు వెయిటేజీ ఇచ్చే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కెసీ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు వెయిటేజీ లేకపోతే ప్రవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకే 60 శాతం సీట్లు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకుల కొరత ఉందని, గత ఆరు సంవత్సరాల నుండి నియామకాలు చేపట్టలేదని చెప్పారు. అధ్యాపకులు, ఉప కులపతి, గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ త్వరలో నియమించేందుకు చర్యలు తీసుకుంటామని కులపతి కేసీ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీకి నూతనంగా ఏర్పాటు చేసిన భనవ సముదాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు. విజయవాడలో విసీ కార్యాలయాన్ని గతంలో ఏర్పాటు చేశారని, దీని వల్ల ఉపయోగం లేనందున త్వరలో దీనిని తొలగించే అవకాశం ఉందని అన్నారు. ట్రిపుల్ ఐటీలు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు వివిధ విభాగాలలో ఆడిట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫైనాన్స్, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలపై ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ఏవైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రకృతి వైపరీత్యాల్లో ఆపదమిత్రల సేవలు
అనిర్వచనీయం కావాలి

అగ్నిమాపక శాఖ డీజీ అనూరాధ ఆదేశం

మచిలీపట్నం, జూలై 18: ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనిర్వచనీయమైన సేవలు అందించే విధంగా ఆపదమిత్రలను తయారు చేయాలని రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎఆర్ అనూరాధ ఫైర్ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఆపదమిత్రలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురువారం ఆమె పరిశీలించారు. ఆపదమిత్రులకు ఇస్తున్న శిక్షణ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆపదమిత్రులకు అన్ని రకాలుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆపదమిత్రలు ఎదురొడ్డి నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, డీఎఫ్‌ఓ బాలరాజు, ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.