కృష్ణ

ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అక్రమాలను సహించేది లేదని జిల్లా పౌర సరఫరాల అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన జి మోహనబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల అధికారిగా పని చేస్తున్న మోహనబాబును రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పౌర సరఫరాల అధికారిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలతను విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయన మచిలీపట్నంలోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగైన రీతిలో నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆ విధంగా పాలనా వ్యవహారాలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ సన్న బియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా కార్డుదారుల ఇంటికి చేరవేయడం జరుగుతుందన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. టాస్క్ఫోర్స్ దాడులను విస్తృతం చేస్తామన్నారు.