కృష్ణ

తుది అంకానికి ‘బదిలీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*మచిలీపట్నం : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ దాదాపు పూర్తయింది. గత నెల 25వ తేదీన ప్రారంభమైన బదిలీల ప్రక్రియ నేటితో పూర్తి స్థాయిలో ముగియనుంది. ఇప్పటి వరకు దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియ పూర్తయింది. కీలకమైన పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన బదిలీల ప్రక్రియే ఇంకా ముగియాల్సి ఉంది. ఈ రెండు శాఖలకు సంబంధించిన బదిలీల ప్రక్రియకు నేటి వరకు గడువు ఉంది. దీంతో అధికారులు బదిలీల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ భారీగా ఉద్యోగుల మార్పులు, చేర్పులు జరిగాయి. ప్రధానమైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్య, గృహ నిర్మాణం, విద్యా శాఖల్లో జరిగిన బదిలీల్లో ప్రజాప్రతినిథుల మార్క్ కనిపించింది. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా తమకు అనుకూలమైన ఉద్యోగులు, అధికారులను తమ తమ ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. అలాగే ఉద్యోగులు కూడా తమకు అనుకూలమైన ప్రాంతాల కోసం ప్రజాప్రతినిథులచే చేయించుకున్న సిఫార్సులు ఫలించటంతో ఆనందంగా ప్రస్తుత స్థానాలను వీడి కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తహశీల్దార్ల బదిలీలపై పెద్ద ఎత్తున కుస్తీ పట్టారు. తహశీల్దార్ల మార్పులు, చేర్పుల్లో ప్రజా ప్రతినిథుల నుండి పెద్ద ఎత్తున సిఫార్సులు రావటంతో పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో అధికార యంత్రాంగం కిందా పైనా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు రోజులుగా అదిగో తహశీల్దార్ల బదిలీ.. ఇదిగో తహశీల్దార్ల బదిలీ.. అంటున్న అధికారులు ఎట్టకేలకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూర్తి స్థాయి బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. బదిలీ ఉత్తర్వులు వెలువడే వరకు రెవెన్యూ అధికారులు ఒకింత ఉత్కంఠతకు గురయ్యారు. రవాణా శాఖ జోన్-2లో భారీగా బదిలీలు జరిగాయి. ఆ శాఖలో పని చేస్తున్న మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో పాటు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ పిఎస్‌ఆర్ ఆంజనేయులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-2 పరిధిలో మొత్తం 38 మంది మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, 49 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ అయ్యారు. ఇటు పోలీసు శాఖలోనూ బదిలీల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే సీఐలు, ఎస్‌ఐల బదిలీల ప్రక్రియ పూర్తయింది. కొన్ని కీలక సర్కిళ్లకు ఇన్‌స్పెక్టర్ల నియామకం ఇంకా జరగాల్సి ఉంది. కానిస్టేబుళ్లకు సంబంధించి గత రెండు రోజుల పాటు నిర్వహించిన బదిలీ కౌన్సిలింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 280 కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. నేటి నుండి హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం మీద బదిలీల ప్రక్రియ అన్ని శాఖల్లోనూ ప్రహసనంగా మారింది.

నేటి నుండి తిరుపతమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

పెనుగంచిప్రోలు, జూలై 11: స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి శాఖాంబరి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తి అయినట్లు కార్యనిర్వహణ అధికారిణి కె శోభారాణి, పాలకమండలి చైర్మన్ అత్తులూరి అచ్యుతరావులు తెలిపారు. ప్రతి ఏడాది ఆషౌడ మాసంలో భక్తుల సౌజన్యంతో అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లను అందజేయడంతో గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతల ఆలయాలు కూడా కూరగాయలతో అలంకరించారు. ఈ అలంకరణ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలతో పాటు భక్తులు కూడా పాల్గొని కూరగాయల మాలలు అల్లారు. శుక్రవారం ఉదయం 5గంటలకు గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు భక్తులకు శాఖాంబరిదేవిగా దర్శనమిస్తారని, అలాగే ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం ఆరు గంటల నుండి శాకంబరిదేవిగా అమ్మవారు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.

కాలుష్యరహిత పట్టణంగా గుడివాడ

8ప్రజలకు జేసీ బాబూరావు విజ్ఞప్తి

గుడివాడ, జూలై 11: గుడివాడను కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2, గుడివాడ పురపాలక సంఘ ప్రత్యేకాధికారి పిడుగు బాబూరావు అన్నారు. గురువారం పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ పట్టణంలో కాలుష్యం పెరుగుతోందని, దీన్ని అరికట్టే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. 28వ వార్డు పెదపేటలో డ్రైన్లు, రోడ్లను పరిశీలించారు. పెదపేటలోని చికెన్ సెంటర్ నుండి వ్యర్ధాలు డ్రైన్లలో పడవేయడాన్ని గమనించారు. వెంటనే చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు. అక్కడి వాతావరణం పూర్తిస్థాయిలో మెరుగుపడిన తర్వాత తిరిగి చికెన్ సెంటర్‌ను ప్రారంభించుకోవాలని సూచించారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రజల సహకారం లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి గృహిణి తడి, పొడి చెత్తలను వేరు చేసి హోం కంపోస్ట్ ఎరువులను తయారు చేయడం అలవర్చుకోవాలన్నారు. మరుగుదొడ్లు, ఇతర వ్యర్ధ పదార్థాలను డ్రైన్లలోకి విడిచి పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పశువులను బహిరంగ ప్రదేశాల్లోకి వదలవద్దన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని, డ్రైన్లు, రోడ్లపై చెత్తను పడవేయకుండా నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే వేయాలన్నారు. ప్రతి గురువారం పట్టణంలో అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు వార్డుల్లో డ్రైన్లు, రోడ్లను పరిశీలిస్తానన్నారు. 10.30గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో ఉండి పట్టణ ప్రజల సమస్యలపై వచ్చే అర్జీలను స్వీకరిస్తామన్నారు. నేను సైతం గుడివాడ స్వచ్చ సేవలో కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ప్రజలను అభినందించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 107మంది పర్యావరణ మిత్రలు పనిచేస్తున్నారని, వారు ఇంటింటికీ వెళ్ళి ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పిస్తారన్నారు. నేను సైతం గుడివాడ స్వచ్చ సేవలో అనే 20వేల డోర్ స్టిక్కర్లను ఇంటింటికీ వెళ్ళి అంటించి ప్రజల్లో పర్యావరణం, కాలుష్య నివారణ పట్ల చైతన్యం తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.

జిల్లాలో 12 మంది బ్రేక్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ

మచిలీపట్నం, జూలై 11: జిల్లాలో 12 మంది మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు)ను బదిలీ చేస్తూ రవాణా శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్లతో 26 మంది అసిస్టెంట్ బ్రేక్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. విజయవాడ ఆర్టీఓ కార్యాలయంలో పని చేస్తున్న బ్రేక్ ఇన్‌స్పెక్టర్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. గరికపాడు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న ఎవి రవికుమార్‌ను కత్తిపూడి యూనిట్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. విజయవాడ డీటీసీ కార్యాలయంలో పని చేస్తున్న ఇ మృత్యుంజయరాజును తాడేపల్లిగూడెంకు, బివి మురళీకృష్ణను గుడివాడ ఆర్టీఓ కార్యాలయానికి, బి భీమారావును కాకినాడ డీటీసీ కార్యాలయానికి, వి శ్రీనివాస్‌ను రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయానికి, జి ప్రసాదరావును ఉయ్యూరుకు, ఎం హరనాధరెడ్డిని మండపేటకు, ఎస్‌బి శేఖర్‌ను ఏలూరు డీటీసీకి, కె వెంకటేశ్వరరావును గరికపాడు చెక్‌పోస్టుకు, ఎం రవికుమార్‌ను రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయానికి బదిలీ చేశారు. గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్ సురేష్‌ను కాకినాడ డీటీసీకి, కెఆర్ రవికుమార్‌ను నూజివీడుకు బదిలీ చేశారు. మచిలీపట్నం బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఎం సీతాపతిరావును తాడేపల్లిగూడెంకు, నూజివీడు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వై నాగేశ్వరరావును మచిలీపట్నంకు, జగ్గయ్యపేట బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఎంవి నారాయణరాజును విజయవాడ డీటీసీకి, ఉయ్యూరు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ టివిఎన్ సుబ్బారావును నందిగామ ఆర్టీఓ కార్యాలయానికి, నందిగామ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్‌ను విజయవాడ డీటీసీకి బదిలీ చేశారు. మండపేట బ్రేక్ ఇన్‌స్పెక్టర్ జి సంజీవ్ కుమార్‌ను విజయవాడ డీటీసీకి, ఏలూరు డీటీసీలో పని చేస్తున్న జి నాగమురళిని విజయవాడ డీటీసీకి, భీమవరం ఆర్టీఓ కార్యాలయంలో పని చేస్తున్న ఎన్ శివరామకృష్ణను విజయవాడ డీటీసీకి, తేటగుంట చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఎస్ రంగనాయకులును విజయవాడ డీటీసీకి, పెద్దాపురం బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఆర్ ప్రవీణ్‌ను విజయవాడ డీటీసీకి, పాలకొల్లు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ బీఎస్‌ఎస్ నాయక్ విజయవాడ డీటీసీకి బదిలీపై రానున్నారు.