కృష్ణ

ఇక ‘స్థానిక’ పోరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను రిజర్వేషన్ల ప్రక్రియకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. గత ఐదు రోజుల క్రితమే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను విడుదల చేసిన పంచాయతీ అధికారులు నేడు రిజర్వేషన్ల ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రస్తుతం వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బంది ఈ నెల 28వతేదీ నుండి 30వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో ఆయా వర్గాల ఓట్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు గాను జిల్లా పంచాయతీ అధికారి రవీంద్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 27వతేదీ నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేసి 28, 29 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 31వతేదీన కులాల వారీగా ఓటర్ల జాబితాలను ఆయా గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులలో ప్రదర్శించనున్నారు. దీనిపై జూన్ 1వతేదీ నుండి 3వ తేదీ వరకు ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 4వతేదీ నుండి 10వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ, నిర్ధారణ చేయనున్నారు. 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి 18వతేదీన తుది జాబితాలను విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 980 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 23లక్షల 41వేల 337 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి నుండి కులాల వారీగా ఓటర్ల విభజన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వతేదీన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా శనివారం తాడేపల్లిలో జరిగిన వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ పక్ష సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై జగన్ స్పందించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సత్వరమే అక్కడ కూడా ఇదే జోష్ ప్రదర్శించాలని ఎన్నికైన ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల సంఘం కూడా గత నెల రోజుల నుండే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 20వతేదీన గ్రామాల వారీగా పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒకటి లేదా రెండు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అనివార్యమనే చెప్పాలి.