కృష్ణ

ఉనికి కోల్పోతున్న గుర్రప్ప చెరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవనిగడ్డ గుర్రప్ప చెరువును అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో 13 ఎకరాల విస్తీర్ణం కలిగిన గుర్రప్ప చెరువును అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మంచినీరు నిల్వ చేయకపోవటంతో మండు వేసవిలో పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. దీనివల్ల ఈ చెరువు చుట్టు పక్కల ఉన్న చేతి పంపులలో ఉప్పునీరు వచ్చే పరిస్థితి ఏర్పడి వినియోగదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత మూడు సంవత్సరాలు నుండి పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి నిర్లక్ష్యం కారణంగానే దాదాపుగా నియోజకవర్గంలో నీటి చెరువులన్నీ ఎండిపోయి ప్రజలు, పశువులు దాహానికి అల్లాడిపోతున్న దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అవనిగడ్డ గుర్రప్ప చెరువు పూర్తిగా ఎండిపోయి బీటలు వారింది. చెరువులో నీరు నిండుకోవడంతో జమ్ము, తూటకాడ, గడ్డి పెరిగిపోయ, చెరువు రూపురేకలు మారిపోయాయ. దీనివల్ల చెరువు ఉనికి కోల్పోయ బంజరుగా దర్శనమిస్తోంది. చెరువులో పెరిగిన తూడు, తదితరాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తొలగించాల్సిన అవసరం ఉంది. త్వరలో కాలువలకు నీరు రాగానే ఈ చెరువుకు వచ్చే పంట బోదెను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. వర్షాలు వస్తే మరలా ఈ చెరువును బాగు చేయటం సాధ్యపడదు. చెరువును అభివృద్ధి చేయటం ద్వారా మంచినీటి కొరత లేకుండా చూడాలని పలువురు ముక్తకంఠంతో కోరుతున్నారు.