కృష్ణ

విజేతలకు డిక్లరేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : జిల్లాలోని రెండు పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన ప్రజాప్రతినిథులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత డిక్లరేషన్‌లు అందుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోనే విజేతలకు అధికారులు ధృవీకరణ పత్రాలను అందచేసి అభినందనలు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శ్రీనివాస్ (నాని) ఎన్నికవ్వగా వారు ఇరువురికి ఆయా పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా ధృవీకరణ పత్రాలను అందచేశారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యునిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ శాసనసభ్యునిగా కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని), పామర్రు శాసనసభ్యునిగా కైలే అనీల్ కుమార్, విజయవాడ తూర్పు శాసనసభ్యునిగా గద్దె రామ్మోహనరావు, పెనమలూరు శాసనసభ్యునిగా కొలుసు పార్థసారథి, అవనిగడ్డ శాసనసభ్యునిగా సింహాద్రి రమేష్‌బాబు, పెడన శాసనసభ్యునిగా జోగి రమేష్, నూజివీడు శాసనసభ్యునిగా మేకా ప్రతాప్ అప్పారావు, కైకలూరు శాసనసభ్యునిగా దూలం నాగేశ్వరరావు, గన్నవరం శాసనసభ్యునిగా వల్లభనేని వంశీ మోహన్, మైలవరం శాసనసభ్యునిగా వసంత కృష్ణప్రసాద్, జగ్గయ్యపేట శాసనసభ్యునిగా సామినేని ఉదయభాను, తిరువూరు శాసనసభ్యునిగా కొక్కిలిగడ్డ రక్షణనిధి, నందిగామ శాసనసభ్యునిగా మొండితోక జగన్మోహనరావు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యునిగా వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యునిగా మల్లాది విష్ణులకు ధృవీకరణ పత్రాలను ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు అందచేశారు.

భేషుగ్గా ముగిసిన ఎన్నికలు

* ప్రశాంతంగా తుది ఘట్టం

* తొలి నుండి అప్రమత్తతే

* కలెక్టర్, జెసీ చర్యలకు రాజకీయపక్షాల అభినందనలు

* సిబ్బందిని సమన్వయపరుస్తూ ఎన్నికల విధులు

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 24: సార్వత్రిక ఎన్నికల తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పూర్తి చేసింది. తొలి ఘట్టం నుండి తుది ఘట్టం ముగిసే వరకు జిల్లా అధికార యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేందుకు కృషి చేశారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా నేతృత్వంలో అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసింది. బందరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్లారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు తక్షణం స్పందించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ప్రత్యేక కార్యాచరణతో సిబ్బందితో పని చేయించుకున్నారు. ఎన్నికల విధుల్లో ఎక్కడా కూడా అలసత్వాన్ని ప్రదర్శించకపోవడం విశేషం. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ఏర్పాట్లు చేసి పోటీలో ఉన్న అభ్యర్థులచే శభాష్ అనిపించుకున్నారు. నామినేషన్ల ప్రక్రియతో పాటు పోలింగ్ సమయంలో కూడా ఎటువంటి వివాదాలు లేకుండా చూడగలిగారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల సిబ్బంది అవగాహనారాహిత్యం కారణంగా ఈవీఎంల సమస్య ఎదురైనప్పటికీ కలెక్టర్, జెసీలు తక్షణం స్పందించి బెల్ కంపెనీ ఇంజనీర్లతో ఆ సమస్యలను క్షణాల్లో పరిష్కరించి సజావుగా పోలింగ్ జరిగేందుకు కృషి చేశారు. ఆ తర్వాత ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవీఎంలను భద్రపర్చిన కృష్ణా విశ్వ విద్యాలయం, ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. చీమను సైతం దూరనివ్వకండా పకడ్బందీ భద్రత కల్పించారు. తుది ఘట్టమైన శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్న మూడంచల భద్రత నడుమే ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్‌లో హాజరయ్యే సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మీడియాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. బస ఏర్పాట్లతో పాటు అల్పాహారం, భోజన ఏర్పాట్లను భేషుగ్గా చేశారు. ఏర్పాట్ల విషయంలో ఏ చిన్న విమర్శను అధికార యంత్రాంగం ఎదుర్కొకపోవటం విశేషం. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించడంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తీసుకున్న చర్యలు, అధికార యంత్రాంగం ప్రదర్శించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

నాడు ఆర్‌ఎస్‌ఐ..
నేడు సీఎం సీఎస్‌ఓ

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 24: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులైన అమర్లపూడి జోషి జిల్లాలో సేవలు అందించారు. 1992-95 వరకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం ఆర్‌ఎస్‌ఐగా సేవలు అందించారు. ఉత్తమ వాలీబాల్ క్రీడాకారుడైన జోషి విధి నిర్వహణలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఇంతకు ఇంతై ఎదిగి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులు కావటం పట్ల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న పలువురు పోలీసు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.