కృష్ణ

రికార్డులను అధిగమించిన ‘ప్రతాప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, : నూజివీడు నియోజకవర్గం శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 16,277 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తన రికార్డును తానే అధిగమించారు. అయిదు పర్యాయాలుగా శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన ప్రతాప్ అప్పారావు రెండు పర్యాయాలు ఓటమి చెందగా, మూడు పర్యాయాలు విజయం సాధించారు. 1994 లో నూజివీడు సీటు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. నాడు కోటగిరి హనుమంతరావుకు నూజివీడు సీటు లభించింది. 1999 ఎన్నికలలో కూడా టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి చిన్నం రామకోటయ్య విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రతాప్ అప్పారావు ఓడిపోయారు. 2014 ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేసి 10,408 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికలలో 16,277 ఓట్ల మెజార్టీ సాధించిన ప్రతాప్ అప్పారావు తన రికార్డును తానే అధిగమించారు. ఈ ఎన్నికలలో ప్రారంభం నుండి కనీసం పది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమా ప్రతాప్ అప్పారావులో ఉంది. ముఖ్య అనుచరుడు బసవ బాస్కరరావు పార్టీని వీడి జనసేన లో చేరి ఎన్నికల బరిలోకి దిగటంతో ముఖ్యంగా నూజివీడు పట్టణంలో ఎక్కువ ఓట్లు చీలిపోతాయనే భయం వైకాపా నాయకులను వెంటాడింది. అయితే ఫ్యాన్ స్పీడుతో ఓట్ల చీలికకు గండి పడింది. కౌంటింగ్ ప్రారంభం నుండి ప్రతాప్ అప్పారావుకు అధిక్యత లభిస్తూనే వచ్చింది. నియోజకవర్గం పరిధిలోని నూజివీడు మండలంలో 4,054 ఓట్ల మెజార్టీ, ముసునూరు మండలంలో 2,770 ఓట్ల మెజార్టీ, ఆగిరిపల్లి మండలంలో 168 ఓట్ల మెజార్టీ, చాట్రాయి మండలంలో 3,332 ఓట్ల మెజార్టీ, నూజివీడు పురపాలక సంఘం పరిధిలో 5,708 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ప్రతాప్ అప్పారావు విజయం సునాయసం అయింది. ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధిముద్దరబోయిన వెంకటేశ్వరరావు రెండో పర్యాయం కూడా ఓటమి చూడక తప్పలేదు.
పార్టీల వారీగా పోలైన ఓట్లు
నూజివీడు నియోజకవర్గం పరిధిలో వివిధ రాజకీయ పార్టీలకు పోలైన ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి బొమ్మారెడ్డి వెంకట నాగ చంద్రారెడ్డి కి 1,912 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు 85,301, వైకాపా అభ్యర్ధి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు 1,01,333, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బిడీ రవికుమార్‌కు 2,117, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కప్పారెడ్డి ప్రవీణ్‌కుమార్‌కు 238, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్ధి కంభంపాటి పూర్ణచంద్రరావుకు 121, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్ధి పత్తిపాటి అంబేద్కర్‌కు 137, జనసేన పార్టీ అభ్యర్ధి బసవ బాస్కరరావుకు 5,423, స్వతంత్ర అభ్యర్ధి అనే్న వనజకు188, దున్నిశెట్టి అశోక్‌కుమార్‌కు 170, సోము వెంకట శివ పూర్ణచంద్రరావుకు 237 ఓట్లు లభించాయి. 2,236 మంది నోటాకు ఓటు వేశారు.
అభినందనల వెల్లువ
నూజివీడు ఎమ్మెల్యేగా మరో పర్యాయం అత్యధిక మెజార్టీతో ఎన్నికైన ప్రతాప్ అప్పారావును పలువురు అభినందించారు. వైకాపా నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.