కృష్ణ

ఓట్ల లెక్కింపుకు పక్కా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఓట్ల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపట్టి విజయవంతంగా నిర్వహించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి ఓట్ల లెక్కింపునకు చేపట్టవలసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 23న మచిలీపట్నం, కృష్ణా యూనివర్శిటీ, గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా లెక్కింపు కేంద్రంలో పోలింగ్ కేంద్రాల ఆధారంగా 10 నుండి 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేసి త్వరితగతిన కౌంటింగ్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూచించారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపేలా ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచుతామన్నారు. జిల్లా ఎస్సీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించే ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్‌లు కలిగి ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని మాత్రమే ఆనుమతిస్తామన్నారు. సమావేశంలో నగర మున్సిపల్ కమిషనర్ రామారావు, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ-2 పీ బాబూరావు, 16 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.