కృష్ణ

జిల్లాలో ప్రధాన కాల్వలు, కృష్ణానది తీరప్రాంత ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పంట కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించి సంపూర్ణ పర్యావరణ జిల్లాగా తీర్చిదిద్దేందుకు 25వేల మంది ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో చేపట్టే కృష్ణానది, కాలువల ప్రక్షాళన బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన కాలువలతో పాటు వాటి అనుసంధాన కాలువలు, కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో చెత్త, చెదారం వంటివి తొలగించే బృహత్తర కార్యక్రమం నిర్వహణపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ, నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్య, తదితర శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కృష్ణానది దిగువ ప్రాంత రైతులకు, ప్రజలకు తాగు, సాగునీరు అందించే ప్రధాన కాలువలు, వాటి అనుబంధ కాలువలను ప్రక్షాళన చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా సుమారు 25వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారాన్ని తీసుకుని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మురుగునీరు, వ్యర్థ పదార్థాలు కాలువల్లోకి వదిలేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు విడుదల చేసిన నీరు లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛమైన నీటిని దిగువ ప్రాంత ప్రజలకు అందించేందుకు కాలువలను కలుషితం చేసే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. యనమలకుదురు - పులిగడ్డ కరకట్ట ఇరువైపులా భవనాల తొలగింపు, మెటీరియల్‌ను డంప్ చేయడం వల్ల వహనాల రాకపోకలతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా వాటిని అరికట్టేందుకు నీటిపారుదల, పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ-2 పిడుగు బాబూరావు, జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీఎల్‌ఎన్ చౌదరి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రఘుబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు.