కృష్ణ

తెలుగువారి సంక్షేమమే జనసేన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సంక్షేమం, అభివృద్దే జనసేన పార్టీ ముఖ్య లక్ష్యమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధర్ అన్నారు. ఏపీ జీవాని పోలవరం అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు బారిన పడుతున్న వారందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముప్పు అని, తెరాస ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపు ప్రాంతాలకు ఇప్పటికే పరిహారం అందుతోందన్నారు. కొత్తగా ఏమైనా ప్రాంతాలు చేరితే ఆ ప్రాంతాలకు కూడా న్యాయం చేయాలన్నారు. ముంపు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుండి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నల్లిపాక వరకు కరకట్టను నిర్మించాలని ఆయన డిమండ్ చేశారు. కరకట్ట నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధి చేయడం ద్వారా వెనుక జలాల వల్ల ఏర్పడే తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ఆ విధంగా కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ముంపు ప్రాంతాల నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇరు రాష్ట్రాలు సంయమనంతో ముందుకు సాగాలన్నారు. కేసీఆర్ మాట చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు అంశంలో పూర్తిగా సహకరించాలని మాదాసు గంగాధరం విజ్ఞప్తి చేశారు.