కృష్ణ

మూల్యాంకనంలో అధికారుల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : జిల్లాలో పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూలులో గత ఐదు రోజులుగా జరుగుతున్న పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యా శాఖాధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కృష్ణాజిల్లాలో 5లక్షల 23వేల సమాధాన పత్రాలకు గాను ఇప్పటి వరకు లక్షా 93వేల 24 సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి వివరించారు. ఈ పరిశీలనలో డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌లైన మచిలీపట్నం, గుడివాడ డీవైఇఓలు బి సత్యనారాయణమూర్తి, కమల కుమారి, జిల్లా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు లింగేశ్వరరావు తదితరులు ఉన్నారు.