కృష్ణ

రాష్ట్రంలో మళ్లీ టీడీపీ పాలనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, : జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు, టీడీపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జరిగిన ఎన్నికలలో వైకాపా ఎన్నో అవాంతరాలు సృష్టించిందని ఆరోపించారు. లేనిపోని దుష్పచారాలు చేసిందని, పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించిందని చెప్పారు. అయినప్పటకి మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని ఓటు వేశారని తెలిపారు. ఎక్కువ శాతం మహిళలు టీడీపీకే ఓట్లు వేశారని, టీడీపీ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. మహిళలే టీడీపీకి దేవతలని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఒక అన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పసుపు కుంకుమ కింద పది వేల రూపాయలు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబునాయుడే ఉందని ప్రజలు కూడా గుర్తించారని, దీంతో వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటర్లందరూ వచ్చి ఓటు వేసి వెళ్ళారని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పధకాలే టీడీపీ గెలుపుకు నాంది అని అన్నారు. అయితే ఎన్నికలలో టీడీపీ ఓడి పోతుందని వైకాపా నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. వైకాపా అధినేత జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావటం కల అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్‌మోహనరెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఏనాడూ ప్రజా సమస్యలపై స్పందించలేదని విమర్శించారు. శాసనసభ, పార్లమెంట్ సమావేశాలలో ప్రజా సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని మాగంటి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. వైకాపాకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పోలింగ్ రోజుల వైకాపా దురాగతాలకు ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రజల మనోభావాలు కాపాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశలో బీజేపీకి దూరమై కరెక్టు టర్నింగ్ తీసుకున్నామని చెప్పారు. కేసిఆర్, నరేంద్రమోదీ, జగన్‌లు ఎన్ని కుట్రలు పన్నినప్పటకీ రాష్ట్రంలో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపిగా తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 140 శాసనసభ స్థానాల్లో టీడీపీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు, నూజివీడు టీడీపీ అభ్యర్ది ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.