కృష్ణ

ప్రశాంతంగా ‘పది’ మూల్యాంకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రం సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ వేదికగా మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే 16వేల 509 సమాధాన పత్రాల మూల్యాంకన జరిగింది. 146 మంది చీఫ్ ఎగ్జామిషనర్లు, 850 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామిషనర్లు, 223 స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకన విధులకు హాజరయ్యారు. జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరించి మూల్యాంకన ప్రక్రియను స్వీయ పర్యవేక్షణ చేశారు. జిల్లాకు మొత్తం 5లక్షల 23వేల 880 సమాధాన పత్రాల మూల్యాంకన జరగాల్సి ఉంది. రోజుకు ఒక్కొక్కరు 40 సమాధాన పత్రాలను మూల్యాంకన చేయాల్సి ఉండగా తొలి రోజున 20 సమాధాన పత్రాల చొప్పున మూల్యాంకన జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మూల్యాంకన విధులకు నియమితులైన ఉపాధ్యాయులు అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలు చూపుతూ తమకు కేటాయించిన విధులను రద్దు చేసుకునేందుకు క్యాంప్ ఆఫీసర్ అయిన డీఇఓ రాజ్యలక్ష్మి ముందు క్యూ కట్టారు. వారి వారి వాస్తవ పరిస్థితులు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీఇఓ రాజ్యలక్ష్మి మానవతా ధృక్పదంతో వారికి కేటాయించిన విధులను రద్దు చేశారు. విధుల రద్దు వల్ల మూల్యాంకనకు ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఆమె ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్, బయోలాజికల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో కొంత మేర ఎగ్జామినర్ల కొరత ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. రెండవ రోజైన మంగళవారం నాటికి ఈ కొరతను అధిగమించి పూర్తి స్థాయిలో మూల్యాంకన జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని డీఇఓ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పిఎస్‌ఆర్‌కె లింగేశ్వరరావు, డీవైఇఓలు బి సత్యనారాయణమూర్తి, ఎం కమల కుమారి, కె రవి కుమార్, ఎల్ చంద్రకళ, ఎన్‌వి రవిసాగర్ మూల్యాంకన ప్రక్రియను పర్యవేక్షించారు.