కృష్ణ

ఖచ్చితమైన నివేదికలను కమిషన్‌కు సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌కు అందించాల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన ఛాంబర్ నుండి జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సిన నివేదికలపై చర్చించారు. సమగ్రమైన నివేదికలు తయారు చేసి ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపతిస్వామి
కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కూచిపూడి, ఏప్రిల్ 15: వేదవ్యాస మహర్షి అర్చామూర్తి రూపంలో వేంచేసిన శ్రీ లక్ష్మీపతి స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచలక్ష్మీ నారాయణ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెదముత్తేవి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీపతి స్వామి, శ్రీ రాజ్యలక్ష్మిదేవి, శ్రీ గోదాదేవి కల్యాణోత్సవాలకు సోమవారం విష్వక్సేన పూజతో అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవుల పర్యవేక్షణలో తుర్లపాటి ఆనందసాగర్ పర్యవేక్షణలో స్వామివారు, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించారు. అనంతరం పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, దీక్షా శ్రీకారం, కంకణధారణ, అంకురారోపణ హోమాలు, గరుడధ్వజ ఆవిష్కరణ కార్యక్రమాలను వైఖానస ఆగమ రీతిలో వేద పండితులు నిర్వహించారు.