కృష్ణ

ఒడ్డుకు చేరిన మత్స్యకారుల బోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: మత్స్యశాఖ వేట నిషేధం చేయటంతో సోమవారం స్థానిక శ్రీరామపాదక్షేత్రం సమీపాన గల పుష్కరఘాట్ వద్దకు మత్స్యకారుల పడవలు ఒడ్డుకు చేరాయి. 61 రోజులు పాటు చేపల వేటను సముద్రంలో, నదీ నదాలలో నిషేధించిన కారణంగా చేపల వేట చేయు మత్స్యకారులు తమకు చెందిన నాటు పడవలను, మోటారు బోట్లను ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా మత్స్యకారులు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపల పునరుత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ వేటను పూర్తి స్థాయిలో నిషేధించి ఉన్న కారణంగా ఈ సమయంలో తాము తమకు చెందిన బోట్లకు, వలలకు మరమ్మతులు చేసుకొను పనుల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో తమ జీవనోపాధికి మత్స్యశాఖ గుర్తించిన మత్స్యకారులకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. చేపల వేట నిషేధం కారణంగా జూన్ 15వ తేదీ వరకు చేపలు లభ్యంకాని పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు మాంసం దుకాణాలపై ఆధారపడాల్సి ఉంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజాదివస్’ - అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ
మచిలీపట్నం (కోనేరుసెంటరు) ఏప్రిల్ 15: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదివస్ కార్యక్రమం చక్కటి వేదిక అని అడిషినల్ ఎస్పీ ఎస్ సాయికృష్ణ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎఎస్పీ సాయికృష్ణ పాల్గొని జిల్లా నుండి 11 ఫిర్యాదులు రాగా వాటిలో ఏడు ఫిర్యాదులను తక్షణ పరిష్కారం చూపారు. మిగిలిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదులను పంపారు.