కృష్ణ

తాళం, భజన పోటీలకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: స్థానిక ద్వారకామాయి నగర్‌లో వేంచేసియున్న శ్రీ షిరిడీ సాయి బాబా మందిర 25వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా తాళం, భజన పోటీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి 101 టీములు ఈపోటీలలో పాల్గొంటున్నాయి. ఈపోటీలు స్థానిక శ్రీ షిరిడీ సాయి కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఒక టీంకు మించి మరో టీం తమ ప్రతిభను చాటుకుంటుండటంతో కల్యాణ మండప పరిసరాలు భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి. వరుసగా నాలుగు రోజుల పాటు ఈపోటీలు కొనసాగుతాయని అనంతరం సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు ఉంటాయన్నారు. ముందుగా ప్రకటించిన నగదు బహుమతులతోపాటు పోటీలలో పాల్గొన్న అందరికీ సర్ట్ఫికెట్స్ అందించటం జరుగుతుందన్నారు. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన టీములన్నింటికీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అందరికీ బాబా ఆశీస్సులుండాలి
శ్రీ షిరిడీ సాయి బాబా రజతోత్సవ వేడుకలు ఇక్కడ జరగటం ఆనందదాయకమని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ జరుగుతున్న తాళం, భజన పోటీలను ఆయన సందర్శించి పోటీలలో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బాబా ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులు ఇక్కడి పోటీలలో పాల్గొనటం ఆనందదాయకమన్నారు. కళలకు, సాంప్రదాయాలకు ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లని కళలను, కవులను, సాంప్రదాయాలను పోషించుకోవటం తమ బాధ్యత అన్నారు. కళల అభివృద్ధికి, కవులు, కళాకారుల అభ్యున్నతికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. ఈసందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని వారికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సాయి సేవాదళ్ కోఆర్డినేటర్ వి బాలాజీ ప్రసాద్, కన్వీనర్ లక్ష్మణరావు, కోకన్వీనర్ పొట్టిముత్యపు ప్రభాకరరావు, మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోయ సుధ, కళాకారులు వాణీపతి శాస్ర్తీ, బ్రహ్మారెడ్డి, కోటిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ శ్రేణుల ఆదరాభిమానాలకు ధన్యవాదాలు
* ఆత్మీయ సమావేశంలో కేపీ
జి.కొండూరు, ఏప్రిల్ 15: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆదరాభిమానాలకు మైలవరం వైసీపీ ఇన్‌చార్జ్ వసంత వెంకట కృష్ణప్రసాద్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. జి.కొండూరు కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను కుటుంబ సభ్యునిగా భావించి, తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతలకు రుణపడి ఉంటానన్నారు. ప్రత్యర్థి పార్టీల వాళ్ళు పెట్టిన ఇబ్బందులను సైతం ధైర్యంగా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగిన వైసిపి నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ విజయం కోసం కష్టపడ్డ వారికి రుణపడి ఉ ంటానన్నారు. వైసీపీ శ్రేణుల శ్రమకు తగిన ఫలితం దక్కబోతుందన్నారు. మండల కన్వీనర్ మందా జక్రధరరావు, ఎంపీపీ తిరుపతిరావు, జడ్పీటీసీ కాజ బ్రహ్మయ్య, వేములకొండ రాంబాబు, పులిపాక థామస్ తదితరులు పాల్గొన్నారు.
ఉండ్రపూడి, పోలవరంలో 30 వేల మందికి మహా అన్నసమారాధన
పామర్రు, ఏప్రిల్ 15: పామర్రు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తన హయాంలో ఎంతో కృషి చేశానని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని పామర్రు ప్రస్తుత ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. పామర్రు మండలం ఉండ్రపూడి, పోలవరం అడ్డరోడ్డు వద్ద వేంచేసియున్న రాష్ట్రంలోనే ద్వితీయశ్రేణి స్థాయి గుర్తింపు పొందిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు సందర్భంగా సోమవారం సుమారు 30 వేల మందికి మహా అన్నసమారాధన ఆలయ అధికారి చలాది వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే కల్పన స్వామివారిని దర్శించి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆలయ ప్రాంగణం వద్ద శ్రీ లలితా కోలాట మండలి పామర్రు వారిచే మహిళలు నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఇది ఇలా ఉండగా మంగళవారం రాత్రి 10గంటలకు భక్త చింతామణి నాటకం ప్రదర్శిస్తారని ఆలయ అధికారి సుబ్బారావు తెలిపారు.