కృష్ణ

పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎవరో తేలేది నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆరేళ్లు అధికారంలో కొనసాగే కృష్ణా - గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎవరనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాకపోవటం, 40మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడం, అనేక మడతలతో కూడిన బ్యాలెట్ పత్రాలను చక్కగా విడదీసి కట్టలు కట్టడానికే కొన్ని గంటల సమయం పడుతుంది. ఆపై ప్రతి ఓటును నిబంధనల ప్రకారం ఒకటికి పదిసార్లు పరిశీలించాల్సి ఉంది. పోలైన వాటిలో 50శాతం ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికైనా మొదటి ప్రాధాన్యత ఓటుగా లభిస్తే గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ 50 శాతానికి తక్కువయితే రెండో విడత లెక్కింపులో రెండో ప్రాధాన్యత, అదీ చాలకపోతే మూడో ప్రాధాన్యత ఓటును కూడా పరిగణనలోకి తీసుకుంటూ లెక్కించి విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. దీనివల్ల ఫలితం వెలువడటానికి చాలా సమయమే పట్టనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నెలరోజులుగా జరిగిన ప్రచార సరళిని బట్టి చూస్తే మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, తర్వాత ప్రత్యూష సుబ్బారావు, విద్యావేత్త నూతలపాటి అంజయ్య, కృష్ణప్రసన్న వైట్ల, కోట సాయికృష్ణ, శాఖమూరి ప్రసాద్ రేస్‌లో ముందున్నారు. వాస్తవానికి అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 40మంది అభ్యర్థుల్లో ఇద్దరు ముగ్గురికి తప్ప ఏజెంట్లు కూడా లేకుండాపోయారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క లక్ష్మణరావుకే ఏజెంట్లు కనిపించారు. ఇక ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రెండు జిల్లాల్లో 59.95 శాతం ఓట్లు పోలయ్యాయి. గుంటూరు జిల్లాలో లక్షా 41వేల 970 మంది ఓటర్లకు గాను 84,103 మంది, కృష్ణా జిల్లాలో లక్షా 6వేల 829 మందికి గాను 64,402 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో 45.53 శాతం ఓట్లు పోల్‌కాగా, ఈదఫా 14శాతం అదనంగా ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 19మంది అభ్యర్థులు మాత్రమే పోటీపడ్డారు. నాడు పీడీఎఫ్ అభ్యర్థి, సీపీఎం మద్దతుతో పోటీ చేసిన బొడ్డు నాగేశ్వరరావు, కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్‌పై 19,580 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు నాగేశ్వరరావుకు 34,274 ఓట్లు, చిగురుపాటి వరప్రసాద్‌కు 27,468, ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణకు 13,372, నల్లబోతు విష్ణుకు 6,732 వచ్చాయి. అయితే నాగేశ్వరరావుకు 50శాతం ఓట్లు లేకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కలపగా 47,044 ఓట్లతో విజయం సాధించారు. అనేక కారణాలతో ఈదఫా సీపీఎం, అనుబంధ సంస్థలు ఆయనను పక్కనబెట్టి లక్ష్మణరావును బరిలోకి దించాయి. టీడీపీ పోటీచేస్తే ఢీకొనే శక్తి లక్ష్మణరావు మాత్రమే ఉందనే అభిప్రాయం కూడా నెలకొంది. ముందుగా రాయపాటి, చిగురుపాటి, గొట్టిపాటి ఇలా ఎందరో వేలాది మందిని ఓటర్లుగా చేర్పించి సీటు ఆశించటం కూడా లక్ష్మణరావు అభ్యర్థిత్వానికి కలసివచ్చింది.