కృష్ణ

మోదీతోనే దేశం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: దేశం సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని బందరు పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుడివాక అంజిబాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అంజిబాబు బందరు అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకట గజేంద్రరావుతో కలిసి కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌కు తన నామినేషన్ పత్రాలను అందచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపుగా నామినేషన్ కార్యక్రమానికి అంజిబాబు తరలి వచ్చారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ధీశాలి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రధాని చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను మోదీ అమలు చేసి చూపించారు. దేశంలో నెలకొన్న కీలక సమస్యల పరిష్కారంలో ధీరత్వాన్ని ప్రదర్శించారన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసి దేశంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించారు. దేశంలోని ప్రతి పేద వాడు మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారేనన్నారు. ఇబీసీ రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఇప్పటి వరకు పని చేసిన ప్రధాన మంత్రులంతా ఓట్ల కోసం పని చేశారే గానీ ప్రజల సంక్షేమం కోసం ఏ ఒక్కరూ పని చేయలేదన్నారు. అటువంటి మోదీ నాయకత్వాన్ని దేశంలోనూ, రాష్ట్రంలోనూ బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీపై లేని పోని విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకున్నది మోదీ ఒక్కరేనన్నారు. అటువంటి నిరంతర పోరాట యోధుడిని ప్రధానిగా ఎన్నుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షేక్ బాజీ, కూనపరెడ్డి శ్రీనివాస్, నూకల శేషయ్య నాయుడు, తోట రంగనాధ్, కంభాల శంకరబాబు, హరికృష్ణ, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ఘంటా సతీష్, చలమలశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.