కృష్ణ

వచ్చేది సంక్షేమ రాజ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, పేర్ని వెంకట్రామయ్య (నాని)ల నామినేషన్లకు జనం కదిలి వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది ప్రజలు వీరి నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండే కాకుండా పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చారు. పేర్ని నానితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులైన జోగి రమేష్, సింహాద్రి రమేష్, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడుతో కలిసి ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. సుల్తానగరం ఆంజనేయ స్వామి ఆలయం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీ ఆద్యంతం జన సందోహంతో కళకళలాడింది. నామినేషన్ దాఖలు అనంతరం ఈ సందర్భంగా వల్లభనేని, పేర్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు మరికొన్ని రోజుల్లో రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడనున్నారన్నారు. వచ్చేది వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్న సంక్షేమ ప్రభుత్వమేనన్నారు. నిరంతర శ్రామికుడు జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. గడిచిన ఐదేళ్లుగా మచిలీపట్నం అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. శివారు ప్రాంతాలే కాకుండా పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రాంతాలకు కూడా సక్రమంగా మంచినీటిని అందించలేదన్నారు. రెండు పంటలు పుష్కలంగా పండాల్సిన ఈ ప్రాంత భూములను బీడు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ సలార్ దాదా, బొర్రా విఠల్, మాదివాడ రాము, లంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.