కృష్ణ

కుమ్మక్కు రాజకీయాలు మా విజయానికి అడ్డుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: అపవిత్ర పొత్తులు, కుమ్మక్కు రాజకీయాలు తమ పార్టీ విజయాన్ని అడ్డుకోలేవని వైకాపా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో తమ పర్యటనలో ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే వారి మద్దతు తమకే ఉందన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుండి తమకు అపూర్వమైన స్పందన లభిస్తుందని, బ్రహ్మరధం పడుతున్నారన్నారు. అదేవిధంగా తనపై పోటీ చేస్తున్న మంత్రి ఉమ జిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేయటంలో దిట్ట అని తన పేరు కలిగిన వ్యక్తిని వెతికి పట్టుకుని అతనిచే నామినేషన్ వేయించాడని, గతంలో నందిగామలో కూడా ఇదేవిధమైన జిమ్మిక్కులు చేశాడని ఆరోపించారు. మంత్రి జిమ్మిక్కులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎవరేమిటో ప్రజలకు తెలుసునని, మైలవరం ప్రజలు వివేకవంతులని ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని సాగనంపాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇటువంటి జిమ్మిక్కులు, కుయుక్తులు, కుట్రలు పన్నటం మంత్రి ఉమకు వెన్నతోపెట్టిన విద్యగా అభివర్ణించారు. అదేవిధంగా జనసేన, వామపక్షాలు, ప్రజాశాంతి పార్టీలన్నీ కలిసినా వైకాపా విజయాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈఎన్నికలలో వైకాపా పరిపూర్ణమైన మెజారిటీతో అధికారాన్ని చేపట్టనున్నట్లు జోస్యం చెప్పారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో తన గెలుపు, విజయవాడ పార్లమెంటుకు పివిపి గెలుపు ఖాయమైందన్నారు. ఈసందర్భంగా అన్నకానుక పేరుతో ప్రచురించిన కేలెండర్‌ను కేపీ ఆవిష్కరించారు. ఈసమావేశంలో పార్టీ నేతలు దేవినేని చంద్రశేఖర్, పామర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.