కృష్ణ

మీకు మేమున్నాం.. ధైర్యంగా ఓటేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మీకు మేమున్నాం.. ధైర్యంగా ఓటు వేయండి.. అన్న నినాదంతో కవాతు నిర్వహిస్తోంది. ఈ కవాతు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తోంది. సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పెద్ద ఎత్తున సాయుధ దళ బలగాలు కవాతు నిర్వహించాయి. జిల్లా పరిషత్ సెంటరు నుండి చింతచెట్టు సెంటరు వరకు సుమారు మూడు కిలో మీటర్ల కవాతు నిర్వహించారు. ఈ కవాతులో కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక సాయుధ బలగాలతో పాటు జిల్లాకు చెందిన ఆర్మ్డ్ పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కూడా సాయుధ బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పోలీసు యంత్రాంగం జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. ఆ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ కవాతు నిర్వహించి ప్రజలంతా ధైర్యంగా ఓటు వేయాలని కోరుతున్నారు. కుల, మత, వర్గ వైషమ్యాలకు తావు లేకుండా ఈ విడత ఎన్నికలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలుపుతున్నారు. జిల్లాకు ఆరు కంపెనీలకు చెందిన పారా మిలటరీ ఫోర్స్ వచ్చిందన్నారు. మరికొన్ని కంపెనీల నుండి ఫోర్స్ రానున్నట్లు తెలిపారు. ఈ కవాతులో బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌లు బిబి రవి కుమార్, వాసవి, రమణ, దుర్గా ప్రసాద్, ఎస్‌ఐలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గొన్నారు.
పేటలో టీడీపీ విస్తృత ప్రచారం
జగ్గయ్యపేట, మార్చి 18: పట్టణంలోని 13, 14 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ విజయాన్ని కాంక్షిస్తూ సతీమణి శ్రీదేవి, యువనేత ధనుంజయ సతీమణి శ్రీవల్లి, తదితరులు సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మరోమారు ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు.