కృష్ణ

జిల్లాలో ‘పది’ పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 269 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తొలి రోజు నిర్వహించిన ప్రథమ భాష (తెలుగు-1) పరీక్షకు జిల్లాలో 55వేల 610 మంది విద్యార్థులకు గాను 55వేల 414 మంది హాజరయ్యారు. 196 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 99.65గా నమోదైంది. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్, నిర్మల హైస్కూల్, లేడియాంప్తిల్ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షా సరళిని పరిశీలించారు. జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి ఏడు పరీక్షా కేంద్రాలు, జిల్లా పరిశీలకుడు ఐదు కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 68 కేంద్రాలను పరిశీలించాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వౌలిక వసతి సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఇతరులెవరూ కేంద్రాల్లోకి వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.