కృష్ణ

ఆరు స్థానాలకు ‘జనసేన’ అభ్యర్థుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు జనసేన తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడత జాబితాలో జిల్లా కేంద్రం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బండి రామకృష్ణను ప్రకటించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్ధరాత్రి రెండవ విడత జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు విజయవాడ తూర్పు, పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు, పెడన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే మిత్రపక్షమైన సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరొక స్థానాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. సీపీఎం పార్టీకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించగా సీపీఐ పార్టీకి నూజివీడు స్థానాన్ని కేటాయించింది. ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంది. దీంతో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఇంకా విజయవాడ పార్లమెంట్‌తో పాటు మరో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండవ విడత జాబితా ప్రకారం మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బండ్రెడ్డి రామకృష్ణను ప్రకటించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ప్రముఖ విద్యావేత్త, నోవా విద్యా సంస్థ అధినేత ముత్తంశెట్టి కృష్ణారావును అవనిగడ్డ నియోజకవర్గం నుండి పోటీకి దించారు. ఇప్పటికే ఆయన అవనిగడ్డలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కృష్ణారావు సతీమణి విజయ నిర్మల 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నూజివీడు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ముత్తంశెట్టి దంపతులు జనసేన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇకపోతే పాత మల్లేశ్వరం నియోజకవరగం (ప్రస్తుత పెడన) నుండి టీడీపీ పార్టీ తరఫున గెలుపొంది మంత్రిగా పని చేసిన దివంగత అంకెం ప్రభాకరరావు సమీప బంధువైన అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ను పెడన అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బత్తిన రాము పోటీ చేయనున్నారు. ఈయన గతంలో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డాడు. నాటి నుండి నేటి వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరి తూర్పు నియోజకవర్గ టికెట్‌ను దక్కించుకున్నారు. బీసీ ఐక్య వేదిక నాయకుడిగా బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్న పోతిన వెంకట మహేష్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఛార్టర్డ్ ఎకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్న బొమ్మనబోయిన వెంకట్రావ్‌ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.