కృష్ణ

ఎన్టీఆర్ సొంత గడ్డపై రాజకీయ ప్రహసనం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తార రామారావు సొంత నియోజకవర్గమైన పామర్రు ఎస్సీ రిజర్వ్డు అసెంబ్లీ స్థానానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో 2009 సంవత్సరంలో పామర్రు శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. 2009 సంవత్సరానికి ముందు ఉయ్యూరు నియోజకవర్గంలోని పమిడిముక్కల, తోట్లవల్లూరు, నిడుమోలు మండలాలతో నియోజకవర్గంగా ఉన్న మొవ్వ మండలం, గుడివాడ నియోజకవర్గంలో ఉన్న పామర్రు, పెదపారుపూడి మండలాలు కలిపి పామర్రు కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 196వ నెంబరుతో శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది. 2లక్షల 31వేల 510 మంది జనాభాలో రూ.లక్షా 65వేల 197 మంది ఓటర్లు ఉండేవారు. డీవై దాస్ కాంగ్రెస్ పార్టీ (60,048 ఓట్లు), ఉప్పులేటి కల్పన టీడీపీ (53108 ఓట్లు), మొవ్వ మోహనరావు ప్రజారాజ్యం (23438 ఓట్లు) సాధించగా విజేతగా డీవై దాస్ నిలిచారు. 2009లో అధికార కాంగ్రెస్ పార్టీ రాజశేఖరరెడ్డి హవా, నియోజకవర్గ సాధనలో కీలకపాత్ర పోషించి ప్రచారంలో ముందంజలో ఉండటంతో పాటు తేదేపాకు చెందినవి అనే భావించే ఎస్సీ కులంలోని ఓ సామాజిక వర్గం ఓట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మొవ్వ మోహనరావు చీల్చడంతో నాడు దాస్ గెలుపు సునాయాసమైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం 77వ నెంబరుతో నియోజకవర్గం రూపాంతరం చెంది ఈ సారి ఉప్పులేటి కల్పన వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి 69,546 ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వర్ల రామయ్య 68,477 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీవై దాస్ 6,800 ఓట్లు సాధించగా, వైకాపా అభ్యర్థిని కల్పన విజయం సాధించారు.
ఎన్టీఆర్ కోటపై ఏ జెండా ఎగిరేనూ..? :
ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన పామర్రు నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్వర్గామమైన నిమ్మకూరును చంద్రబాబు తనయుడు లోకేష్, ఎన్టీఆర్ సతీమణి బసవరామతారకం స్వగ్రామమైన కొమరవోలును చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, పెదపారుపూడి మండలాన్ని ఈనాడు రామోజీరావు గ్రూప్, మొవ్వ మండలం, కూచిపూడి ప్రాంతాన్ని సిలీకానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌లతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు నియోజకవర్గంలోని గ్రామాలను దత్తత తీసుకుని వౌలిక సదుపాయాలు కల్పించారు. వైకాపాలో గెలిచిన ఎమ్మెల్యే కల్పన టీడీపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో పచ్చదనం వెల్లివిరిసింది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఎవరికనేది తెలియడం లేదు. గురువారం టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైనా అందులో పామర్రు నియోజకవర్గం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యే డీవై దాస్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యలతో పాటు టీడీపీ నేతలు బూడిగ శ్రీనివాసరావు, మేడేపల్లి ఝాన్సీ రాణి తదితరులు టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. వైకాపా టిక్కెట్టు కోసం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి కైలే అనిల్ కుమార్ ప్రయత్నించి సఫలీకృతులైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా టీడీపీ వారు టిక్కెట్ ఇవ్వకపోతే వైకాపా టిక్కెట్టును డీవై దాస్ ఆశించవచ్చని దాస్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీకి గూడపాటి నిరంజన్, డా. గంటా లావణ్య, బీజెపీకి వెలపర్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీకి మొవ్వ మోహనరావు, నత్తా శ్రీరామమూర్తి టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నా పామర్రు నియోజకవర్గంలో ఎన్నికల పోటీ మరింత తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి రెండు సార్లు టీడీపీ ఓటమి పాలైంది. ఈ సారి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ అభ్యర్థిని గెలిపించాలని భావిస్తున్నట్లు ఇందుకు అన్ని బలప్రయోగాలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఇంత వరకూ ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించకపోవటంతో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలో ఉత్కంఠత నెలకొంది.