కృష్ణ

ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక ఎన్నికల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పారదర్శక ఎన్నికల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఎన్నికల విభాగం ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. 20 మంది సిబ్బంది నిరంతరం ఎన్నికల విభాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల విభాగంతో పాటు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయడమైందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎన్నికల విభాగం ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎటువంటి సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా సామరస్యంగా ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతోనే జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా ఎన్నికల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతేగాక ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి, ఆ సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్ 100ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబరుకు ప్రజలు ఏ సమయంలోనైనా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఒకొక్క గ్రామంలో పరిస్థితి ఎప్పటికప్పుడు నియమించిన పోలీసు అధికారుల ద్వారా సమాచారం రాబట్టి అక్కడి పరిస్థితులను సమీక్షించడం ఆ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో ప్రత్యేకించి బందోబస్తు, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందన్నారు. గతంలో జరిగిన సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ పర్యవేక్షణలో ఎన్నికల విభాగం పని చేస్తుందన్నారు. ఇన్‌ఛార్జ్ డీఎస్పీ విజయరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కిషోర్ బాబు, మరో 20 మంది సిబ్బంది ఎన్నికల విభాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ సాయికృష్ణ, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, పలువురు సీఐలు పాల్గొన్నారు.