కృష్ణ

రాష్ట్ర ప్రజలకు కేంద్రం,రాష్ట్రం చేసేందేమి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్: ఏపీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం విజయవాడ నుంచి తణుకు వెళ్ళుతున్న అయన రాష్ట్ర పార్టీ రాజకీయ సలహాదారు డాక్టర్ దుట్టా రామచంద్రరావు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ప్రజలు అధికారం ఇచ్చింది ఒకరినొకరు తిట్టుకునేందుకు కాదనే విషయాన్ని ఇద్దరూ గుర్తించాలని హితవు పలికారు. దేశ ప్రధానిని రాష్ట్రానికి రాకుడదని ఒక ముఖ్యమంత్రి వాఖ్యానించడం, నిరసన తెలపడం సిగ్గుచేటని ఉమ్మారెడ్డి వాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు కాపురం చేసి ఇప్పుడు ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. విభజన సమయంలో 96,000 కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని 2,26,000 కోట్లకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఎన్నికల ముందు 87,612 కోట్లు ఉన్న రైతుల రుణాలు నేడు 1,37,000 కోట్లకు పెంచారని చెప్పారు. డ్వాక్రా రుణాలు 82,000కోట్ల రుణాలు నేడు 1,44,004 కోట్లకు చేర్చిందన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్‌ల రికవరీ శాతం తగ్గడంతోపాటు రుణాలు తీసుకున్నవారికి వడ్డీల భారం పెరిగిందన్నారు. దేశంలో రెండో స్ధానంలో ఉన్న డ్వాక్రా సంఘాలను చంద్రబాబు తన స్వార్థం కోసం నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ. 3 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర అర్ధిక రంగాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారన్నారు. రానున్న ప్రభుత్వాలపై భారం పడుతుందని అవేదన వ్యక్తం చేశారు.ప్రజల అభివృద్ధికి కేటాయించవలసిన నిధులను దీక్షల పేరుతో దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు దుట్టా శివన్నారాయణ, నక్కా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు ప్రచారాలు తగదు:పటాపంచల
జి.కొండూరు, ఫిబ్రవరి 11: వైసీపీ వాళ్లు చేసేవన్నీ తప్పుడు ప్రచారాలేనని టీడీపీ సీనియర్ నేత, మైలవరం ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ పటాపంచల నరసింహారావు ఖండించారు. ఆయన సో మవారం మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినదే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. వైసీపీ వాళ్ళ మాటలు అందని ద్రాక్షపుల్లన అన్న చ ందంగా ఉన్నాయన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు అండగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు పే దల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నారన్నారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి చేస్తున్న కృషి అమోఘమన్నారు. అడిగిందే తడవుగా నిధులు ఇస్తూ సిమె ంటు రోడ్లు, ప్రహరీ గోడలు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేం ద్రాలు, మసీదుల అభివృద్ధి, షాదీఖానాల ని ర్మాణం, తాగు, సాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేసి మంత్రి ఉమ ప్రజలకు మ రింత చేరువయ్యారన్నారు. పోలవ రం, పట్టిసీమ, చింతలపూ డి పథకాల కోసం అహర్నిశలూ మంత్రి ఉమ శ్రమిస్తూనే ఉన్నారన్నారు. ప్రబు త్వం బాధ్యతగా పనులు చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ప్ర చారం చేస్తున్నాయన్నారు.

జగన్ పాదయాత్రతో మేల్కొన్న చంద్రబాబు
కూచిపూడి, ఫిబ్రవరి 11: కేంద్రంలోని బీజెపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎన్నికల ముందు ప్రత్యేకహోదా గుర్తుకు రావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వైకాపా పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి కైలే అనీల్‌కుమార్ పేర్కొన్నారు. నిన్ను నమ్మము బాబు కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని చినముత్తేవి గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు ఆధ్వర్యంలో గ్రామంలో అనీల్‌కుమార్ పర్యటించి మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేకహోదా ప్రాముఖ్యతను గుర్తించి ంది తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహనరెడ్డి చేపట్టి న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టట ం తో తన రాజకీయ భవిష్యత్తును గుర్తించిన ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మదీక్ష పో రాటంతో ప్రజలను వంచిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న 111 పథకాలలో ఏవీ సక్రమంగా అమలు కావటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారన్నా రు. ఈ కార్యక్రమంలో తాతా శేషుబాబు, దోనే నాంచార య్య, తోట కోటయ్య, సిద్దెల జయరాజు తదితరులు పాల్గొన్నారు.