తెలంగాణ

షోకాజ్ నోటీసు వారికి ఇవ్వరా?: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సిఎల్‌పి నేతగా జానారెడ్డి పనికిరాడంటూ గతంలో కొన్ని వందలసార్లు విమర్శించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలకు పార్టీ హైకమాండ్ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి పనితీరును విమర్శించినందుకు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినవారికి పాల్వాయి, సర్వే చేసిన వ్యక్తిగత నిందలు గుర్తుకురాలేదా? అని ఆయన అన్నారు. కాగా, కృష్ణా బోర్డు నిర్ణయాలు అమలులోకి వస్తే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఎడారిలా మారతాయన్నారు. నదీజలాల్లో తెలంగాణ వాటాను సాధించేందుకు సిఎం కెసిఆర్ కేంద్రానికి లేఖలు రాయడానికి బదులు స్వయంగా దిల్లీ వెళ్లి డిమాండ్లు సాధించేలా కృషిచేయాలని కోమటిరెడ్డి సూచించారు.