మెయిన్ ఫీచర్

కొత్త ఆశలతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాదంతా -ఏక్‌దమ్ సినిమాలు గత్తరగత్తర చేశాయి.
అంచనాలు తలకిందులైనవి కొన్నయితే, అంచనాల్లేకుండా వచ్చి
ఎవరెస్ట్ ఎక్కినవి కొన్ని. చిన్న సినిమా అనుకున్నది -పెద్ద సినిమా వసూళ్లు
రాబడితే, పెద్దవనుకున్న సినిమాలు ‘చిన్న’బోయి తప్పుకున్నవీ ఉన్నాయి.
ఫ్రేమ్‌ని క్లోజప్‌చేసి చూస్తే -తెలుగు సినిమా స్టామినా చూపించే సన్నివేశాలు
ఎన్నో కనిపిస్తాయి. అందుకు -శివలింగాన్ని మోసిన బాహుబలి,
సైకిల్ తొక్కిన శ్రీమంతుడిని ప్రత్యేకించి ఉదహరించాలి. గడచిన ఏడాదిలో
ఆడియన్స్‌కి ఇవే స్పెషల్ ఫీస్ట్. చిత్రపరిశ్రమకు స్టామినానిచ్చే బూస్ట్.
ఇక మిడ్‌ఫ్రేమ్‌లో మాత్రం -పెరగని సక్సెస్ రేటు పరిశ్రమను వెక్కిరిస్తూ రొటీన్ సీన్‌లా సాగిపోయింది. టెన్ పర్సంట్ సక్సెస్ రేటు పెంచేందుకు దర్శక నిర్మాతలు -ఏడాదంతా యాక్షన్ ఎపిసోడ్స్ చేసినా ఫలితం మాత్రం శూన్యం.

అయ్యిందేదో అయిపోయింది. కొత్త ఏడాదిలోనైనా పరిశ్రమను కళకళలాడించాలన్న కానె్సప్ట్‌తో -ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు తెరమీదకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. కొత్త ఏడాది సినిమా ఇండస్ట్రీకి కలిసొస్తందనే పాజిటివ్ టాక్‌తో అడుగులు పడటం మొదలయ్యాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు క్రేజీ సినిమాలే లైన్‌లో ఉన్నాయి. ఎవరే ప్రణాళికతో వస్తున్నారో చూద్దాం.
కొత్త ఏడాది తొలిరోజే ఆడియన్స్‌ను అలరించేందుకు -ఉత్సాహం చూపిస్తున్నాడు రామ్. గత రెండు సినిమాలు అనుకున్నస్థాయి విజయం ఇవ్వలేకపోవడంతో, ఈసారి శైలజతో చెట్టాపట్టాలేసుకుని వస్తున్నాడు. ప్రోమోలో కనిపిస్తున్న వైవిధ్యం -సినిమాలో ఎంతుందో థియేటర్లకు వచ్చిన రామ్‌ను చూసి తెలుసుకోవాలి. నేను..శైలజ టైటిల్‌తో రూపొందిన సినిమా 1నే విడుదల అవుతుంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను పెట్టి సినిమాను కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా -కొత్త ఏడాదిలో రామ్ సినీ జాతకాన్ని విపులంగా చెప్పేదే. అదేరోజు -మరో యువ హీరో తెరపై కనిపించనున్నాడు. లవర్‌బాయ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అబ్బాయితో అమ్మాయి సినిమా ఫస్ట్‌నే విడుదలవుతోంది. మాస్ ఇమేజ్ కోసం (జాదూగాడు) ప్రయత్నించి బొల్తాపడిన నాగశౌర్య, ఆ విషయాన్ని గ్రహించి మళ్లీ లవర్‌బోయ్ అవతారం ఎత్తి చేసిన సినిమా ఇది. రమేష్‌వర్మ దర్శకత్వంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్‌గోపాల్‌వర్మ ఈసారి మరో సంచలన చిత్రంతో వస్తున్నాడు. ఆమధ్య విచిత్రమైన సినిమాలు తీసి తన పేరుని తనే చెడగొట్టుకుని, తను చేయాల్సిన సినిమాలు అవికావని గుర్తించినట్టు ఉన్నాడు. కొత్త టెక్నిక్‌ని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వర్మ ఈసారి వీరప్పన్ జీవితంపై సినిమా తీశాడు. కిల్లింగ్ వీరప్పన్ పేరిట రూపొందిన సినిమా కూడా ఆదిలోనే విడుదలవుతుంది.
సినిమాలో వీరప్పన్ పాత్రలో నిజంగా వీరప్పనే నటించాడా? అనేలా ఉండే నటుడిని పరిచయం చేసి నిజంగా సంచలనం క్రియేట్ చేసాడు వర్మ. ఈమధ్య వర్మ పనయిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అపవాదునుంచి బయటపడేందుకు కిల్లింగ్ వీరప్పన్‌తో సిద్ధమయ్యాడు. రియలిస్టిక్ కథల్ని అద్భుతంగా తెరకెక్కిస్తాడనే పేరున్న వర్మ ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడని అంటున్నారు.
కొత్త ఏడాది ప్రారంభమయ్యే రోజు.. కొంగొత్త ఆశలతో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముగ్గురూ సిద్ధమయ్యారు. ఎవరు కొత్త ఏడాదిని సరికొత్తగా ఆస్వాదిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలతోపాటు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చే సినిమాల పండగ సంక్రాంతి. సంక్రాంతి బరిలో నిలిచేందుకు చిన్నాపెద్దా చాలా సినిమాలు ఎపుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదీ సంక్రాంతి బరిలో దిగేందుకు పందెం కోళ్ళు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న డిక్టేటర్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. భారీ అంచనాలతో వస్తున్న సినిమాతో ఎలాగైనా హిట్‌కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన లయన్ సినిమా అనుకున్నస్థాయి విజయం సాధించకపోవడంతో ఈ డిక్టేటర్ సినిమాతో హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సంక్రాంతి బరిలో దిగేందుకు మరో సీనియర్ హీరో నాగార్జున కూడా రెడీ అవుతున్నాడు. ఆయన రెండు పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోగ్గాడే చిన్నినాయన. పల్లెటూరి కథాంశంతో తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుమతిని పంచుతుంది అని అంటున్నాడు నాగార్జున. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక గత ఏడాది టెంపర్‌తో ఫర్వాలేదనిపించుకున్న ఎన్టీఆర్ కూడా బాబాయ్‌కి పోటీగా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఆయన ఈ సంక్రాంతికి అభిమానులకు బహుమతి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందాయి. ఎన్టీఆర్ విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలో ఈ భారీ సినిమాలతోపాటు చిన్న చితకా సినిమాలు కూడా భారీగానే విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
ప్రముఖ నటుడు చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా రోజుల తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తూ చేయాలనుకున్న 150వ సినిమా కూడా పట్టాలు ఎక్కనుంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన చిరంజీవి 150వ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. తమిళ సూపర్‌హిట్ కత్తి చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ సినిమా జనవరిలో మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.
ఇక ఈ ఏడాదిలో వరుసగా దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు హీరోలు. ఇప్పటికే గత ఏడాది కేవలం గోపాల గోపాల సినిమాతో ఓకె అనిపించుకున్న పవన్ కళ్యణ్ తన తదుపరి సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ కోవలోనే మరో క్రేజీ హీరో మహేష్‌బాబు గత ఏడాది శ్రీమంతుడు సినిమాతో తెలుగు సినిమా స్థాయిని వంద కోట్ల మార్కెట్ దాటించాడు. ఆ ఉత్సాహంతో ఇపుడు బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా జోరుగా జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇక గత ఏడాది ప్రభాస్‌దే అని చెప్పుకోవాలి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. సంచలన దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని హద్దులు దాటించింది. ఈ సినిమాతో ఇతర భాషలలో తెలుగు సినిమాకు ద్వారాలు తెరచుకున్నాయి. ప్రభాస్ ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషలవారికి బాగా నచ్చాడు. బాహుబలి చరిత్రను తిరగరాసింది. ఈ ఏడాది భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.
ఇక అల్లు అర్జున్ కూడా ‘సరైనోడు’ అంటూ సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో ఆకట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు బన్ని. ఇక గత ఏడాది బ్రూస్‌లీ సినిమాతో తీవ్ర నిరాశకు గురైన రామ్‌చరణ్ ఈ ఏడాది తమిళ సూపర్‌హిట్ తనిఒరువన్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ సినిమాతోపాటు ఆయన గౌతంమీనన్ చిత్రంలో కూడా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక గత ఏడాది భారీ అంచనాల నడుమ వచ్చిన కిక్-2తో పెద్ద పరాజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు. దాంతోపాటు ఎవడో ఒకడు హిట్ ఇవ్వకపోతాడా అంటూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది నితిన్ నటించిన చిన్నదాన నీకోసం సినిమా పరాజయం పాలవడంతో ఇపుడు నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆలు నేర్చుకుంటున్నాడు, అదీ సమంతతో కలిసి. ఈ సినిమా ఫిబ్రవరిలో రానుంది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో పటాస్‌తో హిట్ అందుకున్న కళ్యాణ్‌రామ్‌కు షేర్ పెద్ద నిరాశనే మిగిల్చింది. ఇక మెగా మేనల్లుడు సుప్రీంగా హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఈ ఏడాది రెండు విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈసారి మళ్లీ క్రిష్‌తో కలిసి ఓ హర్రర్ సినిమాతో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఇక అదేకోవలో శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ అందుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అక్కినేని హీరోలు నాగచైతన్య దోచేయ్ అంటూ ప్రయత్నించి ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోవడంతో ఈసారి సాహసం శ్వాసగా సాగిపో అంటూ రెడీ అయ్యాడు. మరో హీరో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తూ అఖిల్ సినిమాతో పరిచయం అయినా ఆ సినిమాతో హిట్ అందుకోలేకపోవడంతో ఈసారి రెట్టింపు హిట్ కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలా ఎవరికివారు హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఇక దర్శకుల గురించి పరిశీలిస్తే... గత ఏడాది దర్శకుల్లో రాజవౌళిదే అగ్రస్థానం. బాహుబలి సినిమాతో రికార్డు సృష్టించడమే కాక తన స్థాయిని పెంచుకుని భారతీయ గొప్ప దర్శకుల లిస్టులో చేరిపోయాడు. ఇపుడు రాజవౌళి కోసం ఎన్నో భారీ అవకాశాలు వేచి ఉన్నాయి. ఇక పూరీ జగన్నాధ్‌ది తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక శైలి. ఏడాదిలో కనీసం మూడు సినిమాలు తీయగల సమర్థుడు పూరి జగన్నాధ్. ఈ ఏడాది ఆయన టెంపర్, జ్యోతిలక్ష్మి, లోఫర్ వంటి మూడు సినిమాలను తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాల్లో టెంపర్ కాస్త బెటర్‌గానే ఉంది. ఏది ఏమైనా ఈ ఏడాది కూడా పూరి తన జోరును చూపించేందుకు సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికే ఆయన కన్నడ, తెలుగు భాషలలో రోగ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక మాటల మాంత్రికుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న త్రివిక్రమ్ గత ఏడాది తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో ఓకె అనిపించుకున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన నితిన్‌తో అ ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత ఆయన తమిళ హీరో సూర్యతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక గత ఏడాది అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ అఖిల్ సినిమాను రూపొందించిన వినాయక్ ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇపుడు అందరూ ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమాకోసం రెడీ అవుతున్నాడు. గత ఏడాది రెండు చిత్రాలు ఆగడు, బ్రూస్‌లీ వరుస పరాజయాలతో కాస్త డీలాపడిన శ్రీనువైట్ల ఈసారి మంచి హిట్ కొట్టాలనే ప్రయత్నాల్లో వున్నాడు. ఇలా చాలామంది దర్శకులు కూడా ఈ ఏడాది హిట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు మరి.

-శ్రీ